మహారాష్ట్ర అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 48 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే సకోలీ నుంచి, సునీల్ దేశ్‌ముఖ్ అమరావతి నుంచి, కునాల్ రోహిదాస్ పాటిల్ ధూలే రూరల్ నుంచి, జ్యోతి ఏకనాథ్ గైక్వాడ్ ధారావి నుంచి, పృథ్వీరాజ్ చవాన్ కరాడ్ సౌత్ నుంచి, బంటీ షెల్కే నాగ్‌పూర్ సెంట్రల్ నుంచి, అస్లాం ఆర్ షేక్ మలాద్ వెస్ట్ నుంచి పోటీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి: US-China trade war: అమెరికా-చైనా శత్రుత్వాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేదా?
మహారాష్ట్రలో ఇండియా కూటమిలోని మూడు పార్టీల్లోని ఒక్కొక్క పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే 65 మందితో కూడిన తొలి జాబితాను ప్రకటించారు. ఇక గురువారం కాంగ్రెస్ 48 మందితో కూడిన లిస్టును విడుదల చేసింది. ఇక శరద్ పవార్ పార్టీకి చెందిన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में महाराष्ट्र विधानसभा चुनाव के लिए कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/tElqOKF6ak
— Congress (@INCIndia) October 24, 2024