Supreme Court: వయసును నిర్ధారించడానికి ఆధార్ ప్రామాణికం కాదు
- వయసును నిర్ధారించడానికి ఆధార్ ప్రామాణికం కాదు
- తేల్చి చెప్పిన దేశ సర్వోన్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్ట పరిహారం అందజేయడానికి ఆధార్ కార్డులోని వయసును చూడడం కరెక్ట్ కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు సంజయ్ కరోల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం… 2015లోని సెక్షన్ 94 ప్రకారం స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీ నుంచి మరణించినవారి వయసును నిర్ణయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Navya haridas: వయనాడ్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ఆశ్చర్యపోయాను
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించి రూ.19.35లక్షల పరిహారం ఇవ్వాలని రోహ్‌తక్‌లోని మోటార్ యాక్సిడెంట్ ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. అనంతరం ఈ కేసు హైకోర్టుకు చేరింది. స్థానిక ట్రైబ్యునల్ వయసును తప్పుగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్న ఉన్నత న్యాయస్థానం.. పరిహారాన్ని రూ.9.22లక్షలకు కుదించింది. బాధితుడి ఆధార్‌కార్డు ఆధారంగా వయసు 47ఏళ్లగా నిర్ధరించి పరిహారం లెక్కకట్టినట్లు తెలిపింది. ఆధార్ కార్డు ఆధారంగా వయసును పరిగణనలోకి తీసుకొని హైకోర్టు పరిహారం లెక్కకట్టిందని పేర్కొంటూ బాధిత కుటుంబీకులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పాఠశాల రికార్డుల ప్రకారం అతడి వయసు 45ఏళ్లు మాత్రమేనని వాదించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరపిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. యూఐడీఏఐ ఇచ్చిన తాజా సర్క్యులర్ ప్రకారం.. ఆధార్ కేవలం గుర్తింపు కోసమేనని, పుట్టిన తేదీకి రుజువు కాదన్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తుచేసింది.
ఇది కూడా చదవండి: Vistara Airlines: “సారీ క్షమించండి”.. టాటా గ్రూపునకు చెందిన విస్తారా క్షమాపణలు..
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!