చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఎప్పుడు ఎలా ప్రాణాలు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ మధ్య కర్ణాటకలోని మంగుళూరు రిసార్ట్లో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్లోకి ఈత కొట్టేందుకు దిగి ఊపిరాడక విగతజీవులుగా మారారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. దాదాపు 9 రోజులవుతున్నా.. ఇంకా సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని నియమించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక బీజేపీ అధిష్టానానికి కత్తిమీద సాములా తయారైంది. నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దాదాపు నేటికి 9 రోజులైంది. అయినా కూడా ఈనాటికి సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేకపోయారు. హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది.
బాలికపై అత్యాచార కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇంట్లో ఉన్న బాలికపై.. సంవత్సరాల తరబడి అత్యాచారానికి పాల్పిన సవతి తండ్రికి కేరళ కోర్టు ఏకంగా 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఎయిరిండియా పైలట్ సృష్టి తులి మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు ఆదిత్య పండిట్ దారుణాతీదారుణంగా టార్చర్ పెట్టిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఫెంగల్ తుఫాన్ తీరం వైపు దూసుకొస్తోంది. దాదాప 3-4 గంటల్లో ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను త్వరలో బలహీనపడి నవంబర్ 30 నాటికి తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది