బాలికపై అత్యాచార కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇంట్లో ఉన్న బాలికపై.. సంవత్సరాల తరబడి అత్యాచారానికి పాల్పిన సవతి తండ్రికి కేరళ కోర్టు ఏకంగా 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇది కూడా చదవండి: AIDS: ఎయిడ్స్ లైంగిక సంపర్కం ద్వారా మాత్రమే కాదు.. ఈ మార్గాల ద్వారా కూడా వ్యాప్తి..
ఇంట్లో ఎవరూ లేని సమయంలో సవతి కూతురుపై పదేపదే అత్యాచారం చేసినందుకు కేరళ కోర్టు ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి 141 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ జడ్జి అష్రఫ్ .. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POCSO) చట్టం, IPC మరియు జువెనైల్ జస్టిస్ చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం మొత్తం 141 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా రూ.7.85 లక్షల జరిమానా కూడా విధించింది. బాధితురాలికి నష్టపరిహారం అందించాలని కూడా ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Pushpa 2: అనుకున్నంతా అయ్యింది.. పుష్ప గాడు వెనక్కి తగ్గాడు!
దోషి, బాధితురాలు తమిళనాడు స్థానికులని, సవతి తండ్రి 2017 నుంచి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారి తెలిపారు. స్నేహితుడి సలహా మేరకు బాలిక చివరకు తన తల్లికి చెప్పిందని, వారు పోలీసులకు సమాచారం అందించారని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: అనుకున్నంతా అయ్యింది.. పుష్ప గాడు వెనక్కి తగ్గాడు!