Thailand: బీచ్ ఒడ్డున ధ్యానం.. భారీ కెరటానికి కొట్టుకుపోయిన రష్యన్ హీరోయిన్.. వీడియో వైరల్
- థాయ్‌లాండ్ బీచ్‌లో విషాదం
- భారీ కెరటానికి కొట్టుకుపోయిన రష్యన్ హీరోయిన్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చావు ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. ఎప్పుడు ఎలా ప్రాణాలు పోతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ మధ్య కర్ణాటకలోని మంగుళూరు రిసార్ట్‌లో ముగ్గురు యువతులు.. స్విమ్మింగ్ ఫూల్‌లోకి ఈత కొట్టేందుకు దిగి ఊపిరాడక విగతజీవులుగా మారారు. తాజాగా రష్యన్ బ్యూటీ సముద్ర ఒడ్డున ధ్యానం చేస్తుండగా ఒక్కసారిగా భారీ కెరటం దూసుకొచ్చి లాక్కెళ్లిపోయింది. అందరూ చూస్తుండగానే శవంగా మారిపోయింది. ఈ ఘోర విషాదం థాయ్‌లాండ్‌లో చోటుచేసుకుంది.
24 ఏళ్ల రహ్యన్ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ థాయ్‌లాండ్‌లో పర్యటిస్తోంది. కోహ్ సుముయ్ ద్వీపంలో ఉన్న రాళ్లపై కూర్చుని ధ్యానం, యోగా చేస్తోంది. ప్రశాంతంగా ఆమె ధ్యానంలో మునిగిపోయింది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ కెరటం దూసుకొచ్చింది. ఆమె కూర్చున్న చోటు దగ్గరకే అలలు రావడంతో సముద్రంలోకి లాక్కుపోయింది. సమీపంలో ఉన్న వాళ్లంతా ఆమెను పరిశీలిస్తూ మొబైల్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే ఒకరు ఆమెను రక్షించేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. కొద్దిసేపటికి ఆమె శవమై ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
- Explainer: అక్కడికి పోతే... అటు నుంచి అటే పోతారు..!
- Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. 'ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం'
- Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ఇదిలా ఉంటే ధ్యానానికి ముందు ఆమెకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ధ్యానం కోసం తీసుకెళ్లిన వస్తువులన్నీ సముద్రంలో తేలియాడిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆమె అలల్లో కొట్టుకుపోతుండగా ప్రాణాలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది.. కానీ ప్రాణాలు మాత్రం దక్కలేదు. ధ్యానం చేస్తున్న రాతి నుంచి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి థాయ్‌లాండ్‌కు విహారయాత్రకు వెళ్లిందని, అంతకుముందు కూడా అదే స్థలంలో ధ్యానం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వీపం దగ్గరకు వెళ్లొద్దని.. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. పర్యాటకులు మాత్రం పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. కెమిల్లా బెల్యాట్స్కాయకు ఈ ద్వీపం అంటే చాలా ఇష్టమని తన పోస్టులో పేర్కొంది.
Hình ảnh cuối của nữ du khách tập yoga trên mỏm đá trước khi bị sóng cuốn
Một nữ du khách Nga 24 tuổi đã bị sóng cuốn xuống biển khi tập yoga trên mỏm đá tại điểm ngắm cảnh Lad Koh, đảo Koh Samui, Thái Lan vào ngày 29-11. pic.twitter.com/7VYbwevCzM
— South of Vietnam (@vincent31473580) December 1, 2024
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు