ఎయిరిండియా పైలట్ సృష్టి తులి మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ప్రియుడు ఆదిత్య పండిట్ దారుణాతీదారుణంగా టార్చర్ పెట్టిన సంఘటనలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆదిత్య.. సృష్టి తులిని వేధించడమే కాకుండా.. ఆమె నగదును కూడా భారీగా ఖర్చు చేసినట్లు వెలుగులోకి వస్తున్నాయి. సృష్టి తులి అకౌంట్ నుంచి భారీగా నగదు ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బట్టి తెలుస్తోంది. అక్టోబర్ నెలలో రూ.15,000, నవంబర్ నెలలో రూ.50,000 ఖర్చు చేసినట్లుగా బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బట్టి వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Scissors In Abdomen: మహిళ కడుపులో కత్తెర.. చూసి షాకైన డాక్టర్లు
సోమవారం సృష్టి తులి-ఆదిత్య మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. తనతో కొద్ది రోజుల పాటు ఉండాలని సృష్టి కోరింది. కానీ అందుకు ఆదిత్య అంగీకరించలేదు. ఆమెతో ఉండకుండా.. ఢిల్లీకి కారులో బయల్దేరి వెళ్లిపోయాడు. తన రిక్వె్స్ట్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడని వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని ఉరితాడు చూపించి బెదిరించింది. దీంతో ఆందోళన చెందిన ఆదిత్య.. వెంటనే ఇంటికొచ్చి చూడగా తలుపు లాక్ చేసి ఉంది. మరో మహిళా పైలట్ సాయంతో ఆదిత్య డోర్ పగుల గొట్టి చూడగా సృష్టి విగతజీవిగా మారిపోయింది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. షాకింగ్ న్యూస్‌తో బంధువులు కంగారు పడ్డారు.
ఇది కూడా చదవండి: Ajit Pawar: బీజేపీ నుంచే మహారాష్ట్ర సీఎం.. అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే సృష్టి తులి ఆత్మహత్యకు 15 నిమిషాల ముందే.. కుటుంబ సభ్యులతో మాట్లాడింది. చాలా ఉల్లాసంగా.. సంతోషంగా సంభాషించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. కానీ అంతలోనే మరణవార్త విని షాక్ అయ్యారు. అయితే ప్రియుడు ఆదిత్యనే చంపేశాడని బాధిత కుటుంబం ఆరోపించింది. అతడు పెట్టిన టార్చర్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. మార్చిలో గురుగ్రామ్‌లో ఓ పార్టీలో సృష్టి.. నాన్ వెజ్ తిన్నాదని.. ఆమెపై పెద్ద పెద్దగా అరుస్తూ… మార్గమధ్యలోనే కారు దింపేసి వెళ్లిపోయాడని వాపోయారు. ఇంకో రోజు ఆవేశంలో ఓ కారును ఢీకొట్టి.. ఆమెను దింపేసి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఇంటికొచ్చిందని గుర్తుచేశారు. ఇలా ప్రతీసారి ఆదిత్య దారుణంగా టార్చర్ పెట్టాడని బాధిత కుటుంబం గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Cheapest Car: సామాన్యుల కారు ఇదేనేమో.. రూ.4 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ కారు