IIT Madras: మహిళ రీసెర్చ్ స్కాలర్‌కు లైంగిక వేధింపులు.. నిందితుడు ఎవరంటే..!
- మద్రాస్ ఐఐటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం
- మహిళా స్కాలర్‌పై వలస కార్మికుడు లైంగిక వేధింపులు
- స్నేహితుల సాయంతో నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగింత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. రోజురోజుకి మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా మద్రాస్ ఐఐటీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ రీసెర్చ్ స్కాలర్ అయిన మహిళ(30)పై వలస కార్మికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తారామణి-వేలాచ్చేరి మెయిన్ రోడ్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక మగ స్నేహితుడితో ఉండగా ఈ ఘటన జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అనే 29 ఏళ్ల వలస కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: తిరువళ్లువర్‌కి గవర్నర్ ‘‘కాషాయ’’ నివాళి.. తప్పుపట్టిన కాంగ్రెస్..
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
- Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
మంగళవారం సాయంత్రం మద్రాస్ ఐఐటీ క్యాంపస్ సమీపంలోని టీషాప్ దగ్గర మహిళా రీసెర్చ్ స్కాలర్.. మగ స్నేహితుడితో ఉంది. వలస కార్మికుడు ఆమెను లైంగికంగా వేధించాడు. సాయం కోసం బాధితురాలి కేకలు వేసింది. సమీపంలో ఉన్న స్నేహితులు.. నిందితుడిని పట్టుకుని కొత్తూరుపురం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి కార్మికుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. క్యాంపస్‌లో స్కాలర్‌పై లైంగిక వేధింపులు జరగడం వాస్తవమేనని ఐఐటీ మద్రాస్ దృవీకరించింది. స్నేహితుల సాయంతో ఆమె బయటపడినట్లుగా పేర్కొంది. నిందితుడు క్యాంపస్ వెలుపల బేకరీలో పనిచేస్తున్నాడని.. మద్రాస్ ఐఐటీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నామని.. విద్యార్థులకు బయటకు వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అందుకు ఇనిస్టిట్యూ్ట్ సాయం చేస్తుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ram Charan: సంక్రాంతి అయింది.. ఈసారి దసరా మీద కన్నేసిన చెర్రీ
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!