ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 55 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసలు కురిపించారు. బొగ్గు, గనుల శాఖలో సమర్థతతో పాటు పారదర్శకత తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారని కితాబు ఇచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించారు. విమర్శలు.. ప్రతి విమర్శలతో మాటల యుద్ధం సాగించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్‌కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రూ. 5,337 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించినట్లు తెలిపారు.
బీజేపీపై ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం యంత్రాల ద్వారా 10 శాతం ఓట్లలో వ్యత్యాసాలు కలిగిస్తారని నివేదికల ద్వారా సమాచారం అందిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. దానికి తోడు కేంద్ర బడ్జెట్ కూడా రుచించలేదు. దీంతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా నష్టాల్లోనే కొనసాగాయి.
యూపీఏ, ఎన్డీఏ పాలనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు.
జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. జనవరిలో మొత్తంగా జీఎస్టీ ఆదాయం రూ.1,95,506 కోట్లు వసూలు కాగా.. గతేడాదితో పోలిస్తే 12.3 శాతం పెరగడం విశేషం.