దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు.. దానికి తోడు కేంద్ర బడ్జెట్ కూడా రుచించలేదు. దీంతో సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా నష్టాల్లోనే కొనసాగాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77, 186 దగ్గర ముగియగా.. నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 23, 361 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే.. సరికొత్త రికార్డ్ కనిష్ట స్థాయిలో 58 పైసలు తగ్గి 87.19 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ మొదలైంది!
నిఫ్టీలో ఎల్ అండ్ టీ, ఒఎన్‌జీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా కన్స్యూమర్స్, కోల్ ఇండియా నష్టాలు చవిచూడగా.. బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభపడ్డాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 1 శాతం తగ్గగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లు క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 4 శాతం తగ్గగా, ఎనర్జీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, పీఎస్‌యు సూచీలు 2-3 శాతం తగ్గాయి.
ఇది కూడా చదవండి: Nandamuri Balakrishna: ఎన్టీఆర్‌కు భారతరత్నపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు