ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 55 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్‌లో కేజ్రీవాల్ ప్రసంగించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నగరంలో అన్ని ఉచిత పథకాలను నిలిపివేస్తుందన్నారు. బీజేపీ 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని.. ఒక్క రాష్ట్రం కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొహల్లా క్లినిక్‌లను మూసివేస్తామని కమలనాథులు చెబుతోందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Garam Masala: గరం మసాలా వల్ల బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..!
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తోంది. అయితే మరోసారి అధికారం కోసం ఆప్.. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: T-shirt: రూ. 300 టీ-షర్టు కోసం హత్య..