మహా కుంభమేళాలో భాగంగా ఫిబ్రవరి 12న ప్రయాగ్‌రాజ్‌లో మాఘి పూర్ణిమ స్నానం జరగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.
మహా కుంభమేళాలో మరో ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి మినీ బస్సులో బయల్దేరిన భక్తులను ట్రక్కు రూపంలో మృత్యువు వెంటాడింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. 27 ఏళ్ల తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. తిరిగి లేని మెజార్టీని కమలం పార్టీ అందుకుంది. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక జరగలేదు. ఈ విషయంలో కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
హెచ్‌వీఐ పరీక్ష చేయించుకున్న తొలి ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ రికార్డ్ సృష్టించారు. అంతేకాకుండా కీర్ స్టార్మర్ బహిరంగంగా హెచ్‌వీఐ పరీక్ష చేయించుకుని ఆదర్శంగా నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత ఆదివారం నుంచి ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఊహించని రీతిలో భక్తులు తరలిరావడంతో దాదాపు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
పశ్చిమ బెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే బెంగాల్లో అధికారంలో తృణమూల్ కాంగ్రెస్.. ప్రస్తుతం ఇండియా కూటమిలోనే ఉంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పొత్తు ఉండబోదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చిచెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుస క్యూ కట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటిస్తు్న్నారు. నాలుగు రోజుల విదేశీ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ నుంచి ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లారు. పారిస్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి.
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌లో మోడీ పర్యటించనున్నారు. ఇక 12, 13 తేదీల్లో అమెరికాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 11న ఫ్రాన్స్‌లో ఏఐ సమ్మిట్ జరగనుంది.