ప్రధాని మోడీ విదేశీ పర్యటన నేపథ్యంలో విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడి జరగవచ్చని తమకు సమాచారం వచ్చినట్లుగా ముంబై పోలీసులు వెల్లడించారు.
మాఘి పూర్ణిమ సందర్భంగా మహా కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 73 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.
గాజాను స్వాధీనం చేసుకుని తీరుతామని మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలపై జోర్దాన్ రాజు అబ్దుల్లాతో ట్రంప్ చర్చించారు. గాజాను కొనాల్సిన అవసరం లేదని.. దానిని స్వాధీనం చేసుకుని తీరుతామని ట్రంప్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. రెండో దఫా పరిపాలనలో మస్క్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) కన్నుమూశారు. లక్నోలోని ఎస్జీపీజీఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆదివారం మధుమేహం, బీపీతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.
ప్రధాని మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించారు. మంగళవారం ఏఐ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. మంగళవారం సాయంత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్‌తో సమావేశమయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆర్టీసీ ప్రమాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళ కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీకి సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.