Maha kumbh mela: ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు.. నిండుకున్న పెట్రోల్, ఆహారం.. భక్తులు అవస్థలు
- మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
- 72 గంటలుగా ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల రద్దీ
- ఇంకా తీరని ట్రాఫిక్ కష్టాలు
- నిండుకున్న పెట్రోల్, ఆహారం
- కనీస అవసరాలు తీరక భక్తులు అవస్థలు
- పాలు, చక్కెర.. నిత్యావసర వస్తువులన్నీ నిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. గత ఆదివారం నుంచి ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఊహించని రీతిలో భక్తులు తరలిరావడంతో దాదాపు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు గానీ.. వాహనాలు గానీ కదిలే పరిస్థితులు లేవు. ఇంకో వైపు ప్రయాగ్‌రాజ్‌లో ఆహార వస్తువులు నిండుకున్నాయి. అంతేకాకుండా అన్ని పెట్రోల్ బంకులోనూ ఇంధన కొరత ఏర్పడింది. వాహనాలు కదిలే పరిస్థితి లేక పెట్రోల్ ట్యాంకులు కదిలే పరిస్థితి లేదు.. అలాగే ఆహార వస్తువులు కూడా లోపలికి వచ్చే మార్గం లేదు. దీంతో స్థానిక ప్రజలతో పాటు కోట్లాదిగా తరలివచ్చిన భక్తులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Tiger Roaming: కాటారంలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలలో ప్రజలు!
Also Read
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఇక మూడు రోజుల నుంచి యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఇక కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడమే లేదు. ఆయా రాష్ట్రాల బోర్డర్‌లోనే వాహనాలు నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ నియంత్రణ కావడానికి మరో మూడు రోజుల వరకు సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం యూపీలో పిండి, పప్పులు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులన్నీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక 50 పెట్రోల్ బంకులు వరకు మూసివేశారు. రవాణా సౌకర్యం మెరుగుపడ్డాకే.. పెట్రోల్ ట్యాంకులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు వాహనదారులు ఇబ్బంది పడాల్సిందే. ఇక ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. భారీ ధరలతో అమ్ముతున్నారు. భక్తులు కూడా కొనే పరిస్థితులు లేవు. పాల ఉత్పత్తులు కూడా బాగా తగ్గిపోయాయి. పడవ సేవలు కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా కొన్ని గంటల పాటు పడవ సేవలు నిలిపివేశారు. దీంతో భక్తులు చాలా అసౌకర్యానికి గురయ్యారు.
ట్రాఫిక్ నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. వాహనాల రాకపోకలు సులభతరం చేయడానికి.. భక్తుల రద్దీని నియంత్రించడానికి అదనపు పోలీసు బలగాలను మోహరింపజేస్తున్నామని డీజీపీ తెలిపారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Police Notice to YCP central Office: వైసీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి పోలీసుల నోటీసులు..
తాజావార్తలు
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు