దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్యంపై టారిఫ్ యుద్ధం ప్రకటించడంతో మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. స్టీల్, అల్యూమినియంపై 25శాతం టారిఫ్ విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇది మన మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. ఇక ముగింపులో సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311 దగ్గర ముగియగా.. నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 23, 381 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.48 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Vijay: విజయ్ కీలక నిర్ణయం.. కాసేపట్లో ప్రశాంత్ కిషోర్‌తో భేటీ
అన్ని రంగాలు నష్టపోయాయి. ఇక నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్ప్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, ఒఎన్‌జీసీ ఉండగా.. కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాభపడ్డాయి.
ఇది కూడా చదవండి: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల