ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీపై టెస్లా సీఈవో, వైట్‌హౌస్ సలహాదారు ఎలోన్ మస్క్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యుద్ధంలో సైనికులు, పిల్లలు చనిపోతుంటే.. భార్యతో కలిసి ఫొటోషూట్ చేస్తావా? అంటూ ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: NTRNeel : ఎన్టీఆర్ – నీల్ కథా నేపథ్యం ఏంటంటే..?
ఉక్రెయిన్-రష్యా మధ్య గత మూడేళ్ల నుంచి భీకర యుద్ధం సాగుతోంది. యుద్ధంలో ఉక్రెయిన్ సైనికులు, పిల్లలు చనిపోగా.. ఆస్తులు ధ్వంసమయ్యాయి. తాజాగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యా-అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ లేకుండానే అమెరికా చర్చలు జరుపుతోంది.
ఇదిలా ఉంటే 2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా.. సైనికులు, పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే.. జ్ఞానంగా మసులుకోవాల్సిన జెలెన్ స్కీ.. భార్య ఒలెనా జెలెన్ స్కీతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిట్జ్ ఈ ఫొటోలను తీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆ ఫొటోషూట్ సమయం, సందర్భంగా తెలుసుకుని ఎలోన్ మస్క్ తీవ్రస్థాయిలో జెలెన్ స్కీపై విమర్శలు గుప్పించారు. యుద్ధం సమయంలో ఇవేం పనులంటూ నిలదీశారు. జెలెన్ స్కీ తీరును గతంలో రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా లారెన్ బోబర్ట్, టెక్సాస్ కాంగ్రెస్ మహిళా మైరా ఫ్లోర్స్ కూడా మండిపడ్డారు. ఇదేం తీరు అంటూ ప్రశ్నించారు. మేము మానవతా దృక్పథంతో సాయం చేస్తుంటే.. జెలెన్ స్కీ మాత్రం.. తమను పిచ్చోళ్లను చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోసారి రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఫొటోషూట్ వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ట్రంప్ మాట్లాడుతూ.. జెలెన్ స్కీ.. ఒక నియంత అని.. ఇప్పటి వరకు ఎన్నికలు జరపలేదని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉక్రెయిన్ లేకుండానే శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని జెలెన్ స్కీ తప్పుపట్టారు.
He did this while kids are dying in trenches on the war front pic.twitter.com/NPhDz3cP46
— Elon Musk (@elonmusk) February 20, 2025