దేశ రాజధాని ఢిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ హషీం బాబా భార్య జోయా ఖాన్ (33)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి 270 గ్రాముల హెరాయిన్‌ను సాధీనం చేసుకున్నారు. హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
జైల్లో ఉన్న భర్త హషీం బాబా నేర సామాజ్రాన్ని ఆమెనే నడిపిస్తోంది. ముఠాను నడిపిస్తూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎలాంటి అనుమానాలు రాకుండా నేర సామ్రాజాన్ని నడిపిస్తోంది. తాజాగా హెరాయిన్‌తో పట్టుబడడంతో ఆమె యవ్వారం బయటపడింది. హషీం బాబాపై హత్య, దోపిడీ, ఆయుధాల అక్రమ రవాణా వరకు.. ఇలా డజన్ల కొద్దీ కేసులు ఉన్నాయి. ఇక జోయా ఖాన్.. బాబా మూడో భార్య. 2017లో హషీం బాబాను వివాహం చేసుకునే ముందు.. జోయా మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. విడాకుల తర్వాత బాబాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఈశాన్య ఢిల్లీలో ప్రేమలో పడ్డారు.
ఇది కూడా చదవండి: Matrimonial Sites: మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లే టార్గెట్.. పెళ్లి పేరుతో 15 మందిపై లైంగిక వేధింపులు
బాబా జైలు పాలైన తర్వాత జోయా.. ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌తో కూడా జోయాకు సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. దోపిడీ, మాదకద్రవ్యాల సరఫరా నిర్వహణలో కూడా ఆమె పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె హై-ప్రొఫైల్ పార్టీలకు హాజరవుతూ.. ఖరీదైన దుస్తులు ధరిస్తూ.. లగ్జరీ బ్రాండ్లతో ఎంజయ్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక జైల్లో ఉన్న భర్తను కలుస్తూ.. కోడ్ భాషలో మాట్లాడుకుంటారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Dhanush : ఇటు హీరో.. అటు డైరెక్టర్.. శెభాష్ ‘ధనుష్’
ఎన్నో ఏళ్లుగా ఆమె కోసం గాలిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ ఆమెను పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాయి. అయితే ఈసారి స్పెషల్ సెల్ విజయం సాధించింది. నిఘా సమాచారం మేరకు పోలీసులు ఈశాన్య ఢిల్లీలోని వెల్‌కమ్ ప్రాంతంలో జోయాను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుంచి పెద్ద మొత్తంలో హెరాయిన్‌తో వస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఇక నాదిర్ షా హత్య కేసులో ప్రమేయం ఉన్న షూటర్లకు జోయా ఆశ్రయం కల్పించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక జోయా తల్లిదండ్రులది కూడా నేర సామ్రాజ్యంగానే తెలుస్తోంది. అలాగే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Crime News: రైస్ పుల్లింగ్ పేరుతో ఘరానా మోసం!