Karnataka: రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య.. కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ ఫైర్
- రాజకీయ దుమారం రేపుతున్న నర్సు హత్య
- మత కోణంలోనే హత్య జరిగిందని నెటిజన్లు ట్వీట్లు
- కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందంటూ బీజేపీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ నర్సు దారుణ హత్య కర్ణాటక రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. లవ్ జీహాద్ పేరుతో యువతిని ట్రాప్ చేసి.. మోజు తీరాక నిందితుడు అంతమొందించాడంటూ బీజేపీ ధ్వజమెత్తుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే నర్సు హత్యకు గురైందని మండిపడుతోంది.
హవేరి జిల్లా మసూర్ గ్రామానికి చెందిన యువ నర్సు స్వాతి రమేష్ బ్యాడ్గి.. రాణేబెన్నూర్ పట్టణంలో నర్సుగా పనిచేస్తోంది. నయాజ్ అనే యువకుడు.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల నయాజ్‌కు వేరే సంబంధం కుదిరింది. అంతే స్వాతిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇది కూడా చదవండి: Railway Bridge: అనకాపల్లిలో లారీ బీభత్సం.. కుంగిన వంతెన, తప్పిన పెను ప్రమాదం!
మాట్లాడాలంటూ స్వాతిని నయాజ్ పిలిచాడు. నయాజ్.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రాణేబెన్నూర్‌లోని స్వర్ణ పార్క్‌కు వచ్చాడు. ఆమె కూడా స్వర్ణ పార్క్ వచ్చింది. అనంతరం అక్కడ నుంచి రట్టిహళ్లిలోని ఓ పాడుబడిన పాఠశాలకు తీసుకెళ్లి గొంతు కోసి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని తుంగభద్ర నదిలో పడేశారు.
అయితే మార్చి 3న స్వాతి తప్పిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు గాలించగా.. మార్చి 6న తుంగభద్ర నదిలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్గం నిర్వహించగా.. గొంతు కోసి చంపినట్లుగా తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నయాజ్‌ను అరెస్ట్ చేశారు. తాజాగా అతడికి సహకరించిన ఇద్దరు స్నేహితులు వినయ్, దర్గాచారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దలు కుదిర్చిన వివాహానికి స్వాతి అడ్డొస్తుందన్న ఉద్దేశంతో నయాజ్ చంపినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ
అయితే ఈ వ్యవహారం తాజాగా రాజకీయ దుమారం రేపుతోంది. మతాంతర హత్యలను అరికట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ఈ హత్యను ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ హత్య మనసులను కలత పెట్టేస్తోందని వ్యాఖ్యానించారు. స్వాతి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు.. త్వరతగతిన దర్యాప్తు పూర్తి చేయాలని కోరారు.

తాజావార్తలు
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!