Ranya Rao: రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
- రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు
- ఎక్కడ దాచిందో తనకు తెలుసు అని అసభ్య వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ నటి రన్యారావు బంగారం స్మగ్లింగ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యారావు పట్టుబడింది. ఇక రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టా.. అధికారులపై చర్యలు తప్పవు!
Also Read
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
తాజాగా ఇదే యవ్వారంపై బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్ స్పందిస్తూ.. రన్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పార్ట్స్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రన్యారావు ఏఏ పార్టుల్లో బంగారం దాచిందో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ స్మగ్లింగ్‌లో మంత్రుల ప్రమేయం ఉందని.. ఆ విషయాలన్నీ తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతానని తెలిపారు. తండ్రి రామచంద్రరావు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. స్మగ్లింగ్‌కి ఎలా సహకరిస్తారని నిలదీశారు. ఇక ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయని.. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసిందని.. ఇంకా ఏ చోటులో దాచిందో కూడా తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతి పాయింట్ అసెంబ్లీలో వివరిస్తానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Prabhas : ‘ఫౌజీ’లో మరో హీరోయిన్.. ?
ఇదిలా ఉంటే ఈ బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యత్నాల్‌కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు వ్యతిరేకంగా కూడా గళమెత్తారు. ఆయన కుమారుడు, రాష్ట్ర యూనిట్ చీప్ విజయేంద్రపై కూడా పదే పదే విమర్శలు గుప్పించారు. ఇక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యడియూరప్పను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక 2020లో మైనార్టీలకు వివాహ పథకాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ పథకం కావాలంటే పాకిస్థాన్ వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: IML 2025: ఫైనల్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్, టినో బెస్ట్ మధ్య గొడవ.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!