బాలీవుడ్ సోషలైట్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవత్రమణి చిక్కుల్లో చిక్కుకున్నాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కాట్రాలో వైష్ణో దేవి ఆలయం దగ్గర మద్యం సేవించి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ప్రాంతాన్ని పవిత్ర ప్రాంతంగా భక్తులు భావిస్తారు. అలాంటి స్థలంలో ఓర్రీ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. దీంతో ఓర్రీ సహా చట్టాన్ని ఉల్లంఘించిన ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Court : నిర్మాత నానికి లాభాలు తెచ్చిపెట్టిన కోర్ట్.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
పోలీసులు వివరాల ప్రకారం.. కొంత మంది అతిథులు మద్యం సేవించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఫిర్యాదు పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మార్చి 15న ఓర్రీ, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ పార్థ్ రైనా, శ్రీ రితిక్ సింగ్, శ్రీమతి రాశి దత్తా, శ్రీమతి రక్షిత భోగల్, శ్రీ షగున్ కోహ్లీ, శ్రీమతి అనస్తాసిలా అర్జమస్కినా హోటల్ ప్రాంగణంలో మద్యం సేవించారని తెలిపారు. ఈ హోటల్‌లో ఆల్కహాల్ మరియు నాన్ వెజ్‌కు అనుమతించబడదని చెప్పారు. దివ్య మాతా వైష్ణో దేవి తీర్థయాత్ర స్థలం కాబట్టి నిషేధం ఉందని చెప్పారు. అలాంటి స్థలంలో వారంతా మద్యం సేవించడం చట్ట విరుద్ధం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారందరిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
మత పరమైన ప్రదేశాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదని పోలీస్ అధికారులు హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు, మద్యం చర్యను సహించబోమని తేల్చిచెప్పారు. నిందితులను గుర్తించడానికి పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కాత్రా ఎస్పీ తెలిపారు.
ఓర్రీ.. ఇతడు బాలీవుడ్ సెలబ్రెటీలతో ఎక్కువగా కనిపిస్తాడు. ప్రతి వీఐపీ కార్యక్రమంలో కనిపిస్తాడు. ఇటీవల అనంత్ అంబానీ పెళ్లిలో హల్‌చల్ చేశాడు. ప్రతి ఒక్కరిని హగ్ చేసుకునేవాడు. జాన్వి కపూర్‌తో చాలా దగ్గర మూవ్ అయ్యేవాడు. ఇక టాక్ షో కాఫీ విత్ కరణ్ లో కూడా కనిపించాడు. హై-ప్రొఫైల్ పార్టీలు, ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తాడు.
Jammu & Kashmir | As per police, FIR was registered against eight people, including socialite influencer Orhan Awatramani aka Orry, for allegedly consuming alcohol in a hotel located in Katra
— ANI (@ANI) March 17, 2025