US: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
- ముగ్గురు తెలంగాణ వాసుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీతరెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్ (6), ఆమె అత్త సునీత (56)గా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Sudiksha Missing: సుదీక్ష మిస్సింగ్‌పై కీలక అప్‌డేట్
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
సిద్దిపేటకు చెందిన రోహిత్‌రెడ్డితో ప్రణీతరెడ్డికి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అత్త సునీతతో కలిసి ప్రణీతరెడ్డి, రోహిత్‌రెడ్డి, ఇద్దరు పిల్లలు కారులో వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ప్రణీతరెడ్డి, పెద్ద కుమారుడు హర్వీన్, సునీత సంఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. రోహిత్‌రెడ్డి, చిన్న కుమారుడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో రోహిత్‌రెడ్డే కారు నడుపుతున్నాడు. మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టేకులపల్లి, సిద్దిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలు భారత్‌కు వచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: Railway Bridge: అనకాపల్లిలో లారీ బీభత్సం.. కుంగిన వంతెన, తప్పిన పెను ప్రమాదం!
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!