విద్యావంతులు పది మందికి ఆదర్శంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా నేటి విద్యావంతుల ప్రవర్తన ఉంటుంది. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఓ జంట జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే రాసలీలల్లో మునిగిపోయారు. ఈ ఘటన టెక్ సిటీ బెంగళూరులో చోటుచేసుకుంది.
బెంగళూరులోని మెజెస్టిక్ మెట్రో స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ 3పై ఓ యువకుడు.. స్నేహితురాలితో కలిసి ట్రైన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఇంతలోనే ఆమె దుస్తులను పైకి ఎత్తి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ప్లాట్‌ఫాంపై మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. అయినా కూడా ఏ మాత్రం భయం లేకుండా ట్రైన్ వచ్చేంత వరకూ స్నేహితురాలితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. స్నేహితురాలు కూడా ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సమీపంలో ఉన్న వాళ్లు మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జంట తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తారు. అంతగా కావాలంటే.. పార్కులు ఉన్నాయి.. లాడ్జీలు ఉన్నాయి.. కామ క్రీడకు మెట్రో స్టేషనే దొరికిందా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తు్న్నారు. జంటపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. భవిష్యత్‌లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక ఈ ఘటనపై ఐబీఎంఆర్‌సీఎల్ చీఫ్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ బీఎల్.యశ్వంత్ చవాన్ స్పందించారు. పబ్లిక్‌గా ఒక జంట అలా చేస్తుండగా.. చుట్టూ ఉన్నవారంతా ఏం చేస్తున్నారని నిలదీశారు. కనీసం వీడియోలు తీసేవారైనా.. జంటను హెచ్చరించాలి కదా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు.. బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయకూడదని హెచ్చరించి ఉండాల్సిందని తెలిపారు. జంటపై చర్య తీసుకునేలా భద్రత సిబ్బందికి ఆదేశిస్తామన్నారు. ఏప్రిల్ 9న జరిగిన సీసీటీవీ పుటేజ్‌ను మెట్రో స్టేషన్ నుంచి తీసుకుంటామని.. వారి ప్రయాణ చరిత్ర కూడా తెలుసుకుంటామని చెప్పారు. జంటను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
https://twitter.com/karnatakaportf/status/1910385125482758651