వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ చరిత్రలో ఈ పేరు మరో పదేళ్లు గుర్తుండి పోతుంది. పద్నాలుగేళ్ల ప్రాయంలో ఐపీఎల్‌లో అడుగుపెట్టి 35 బంతుల్లో సెంచరీ బాది ప్రపంచ క్రికెట్‌నే ఆశ్చర్యానికి గురిచేశాడు. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, ఆ తర్వాత 35 బంతుల్లో ఐపీఎల్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది.
ఇది కూడా చదవండి: Vaibhav Suryavanshi: ఒక్క సీజన్లో ఇన్ని రికార్డులా.. విధ్వంసానికి మొగుడిలా ఉన్నావే..
అయితే తొలి మ్యాచ్‌లో వైభవ్ 20 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. ఏడుస్తూ మైదానం వీడాడు. దీనికి సంబందించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీన్ని కొందరు సమర్థించారు. పద్నాలుగేళ్ల వయసులో ఆ మాత్రం పరుగులు చేసి, హాఫ్ సెంచరీకి చేరువలో అవుట్ అవ్వడంతో ఏడవడంలో తప్పేం లేదని కొందరు వైభవ్‌కు మద్దతు పలికారు. ఇక కొందరు విమర్శించడమే పనిగా పెట్టుకునేవాళ్ళు వైభవ్ పై విమర్శలు చేశారు. పసితనం చూపించుకున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. నిజానికి ఆ రోజు వైభవ్ ఏడవలేదట. బిగ్ స్క్రీన్ నుంచి వచ్చే లైటింగ్ వల్ల కళ్ళు మండాయి. దీంతో కళ్ళు తుడుచుకున్నాను. అంతేతప్ప నేనేం ఏడవలేదు. నన్నలా చూసి నేను ఏడ్చానని మీకు మీరే ఊహించుకున్నారు అని వైభవ్ సూర్యవంశీ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే వైభవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ రాయల్స్ ప్లేఆప్స్ రేసు నుంచి తప్పుకుంది. కానీ వైభవ్ లాంటి భారీ హిట్టర్ క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యాడు.
ఇది కూడా చదవండి: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు.. సోనియా, రాహులే కీలకం!