ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. పరస్పర దాడులతో ఆస్తి, ప్రాణ నష్టాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్‌లో కీలక కమాండర్లు సహా అణు శాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ అంతమొందించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తం అయింది. తక్షణమే స్టార్ట్‌ఫోన్ల నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ను తొలగించాలని సూచించింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో వెల్లడించింది. పౌరుల సమాచారాన్ని వాట్సాప్ సంస్థ ఇజ్రాయెల్‌కు అందజేస్తోందని ఇరాన్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Prem Kumar : యూటర్న్ తీసుకుంటోన్న సాఫ్ట్ దర్శకుడు
అయితే ఇరాన్ ఆరోపణలను వాట్సాప్ సంస్థ ఖండించింది. మా సేవలు ప్రజలకు అందకుండా బ్లాక్ చేయడానికి ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం పట్ల ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. లొకేషన్లు గానీ.. కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడు ఉంచుకోమని చెప్పింది. ఇక వ్యక్తిగత మెసేజ్‌లను ట్రాక్ చేయడం కానీ.. అంతేకాకుండా ఏ ప్రభుత్వతోనూ సమాచారాన్ని పంచుకోమని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!
ఏడాది క్రితం వరకు సోషల్ మీడియాపై ఇరాన్‌లో నిషేధం ఉంది. సంవత్సరం క్రితం ఎత్తేసింది. తాజాగా ఇజ్రాయెల్‌తో యుద్ధం మొదలవ్వడంతో ఇరాన్ మళ్లీ నిషేధం విధించింది. ఇరాన్‌లో ఇన్‌స్టా, టెలిగ్రామ్‌తో పాటు వాట్సాప్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అయితే గత శుక్రవారం ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడి చేసినప్పుడు కీలక కమాండర్లంతా మృతిచెందారు. వీరందరూ అత్యంత రహస్య ప్రాంతంలో ఉన్నారు. అయినా కూడా ఇజ్రాయెల్ గురి చేసి చంపేసింది. దీనింతటికి కారణం వారి మొబైల్స్ ట్రాక్ చేసి మట్టుబెట్టినట్లుగా ఇరాన్ భావిస్తోంది. గతంలో హమాస్ అధినేత హనియేను కూడా టెహ్రాన్‌లో చంపేసింది. ఇక తాజాగా 14 మంది అణు శాస్త్రవేత్తలు సహా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు అలీ షాద్మానీ కూడా చనిపోయాడు. దీనింతటికి కారణంగా మొబైల్స్ లొకేషన్లే కారణంగా ఇరాన్ భావించింది. ఈ నేపథ్యంలోనే వాట్సాస్ యాప్‌ను తొలగించాలని పౌరులకు సూచించింది.