మొహసిన్ ఫక్రిజాదే.. ఇరాన్ అణు పితామహుడు. ఇరాన్ అణు ఆశయాల వెనుక ఉన్నది ఇతడే. కానీ ఇతన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ఎలా లక్ష్యంగా చేసుకుందో.. ఏమో తెలియదు గానీ.. అత్యంత రహస్యంగా టెహ్రాన్‌లో 2020లో గురి చేసి కాల్చి చంపేసింది. దీంతో ఇరాన్‌తో పాటు ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. తాజాగా ఆ నాటి ఘటనను నిపుణులు గుర్తు చేసుకుంటున్నారు. ఫక్రిజాదేను చంపింది ఇజ్రాయెలేనని అప్పట్లో ఇరాన్ ఆరోపించింది.

ఇరాన్ అణు కార్యక్రమానికి పితామహుడుగా పిలువబడే ఫక్రిజాదేను ‘ఇరాన్ రాబర్ట్ ఓపెన్ హైమర్’గా ఇజ్రాయెల్ పిలుస్తుంది. 2018లో ఇతని పేరును ఇజ్రాయెల్ బహిరంగంగా బయటపెట్టింది. అంటే అప్పటికే అతన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. 2000లో ఇరాన్ రహస్య అణ్వాయుధ ‘ప్రాజెక్ట్ అమద్’కు ఫక్రిజాదే ప్రధాని సూత్రధారి అని పాశ్చాత్య నిఘా వర్గాలు భావించాయి. 2015 అణు ఒప్పంద సమయంలో కూడా ఇతని పేరు కూడా ప్రస్తావనకు రాలేదు. ఇక బహిరంగంగా కూడా ఎప్పుడూ కనిపించలేదు. కానీ నిఘా వర్గాలు మాత్రం కచ్చితమైన లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి: G7 Summit: జీ 7 సమ్మిట్‌లో మెలోని-మోడీ షేక్‌హ్యాండ్.. వీడియో వైరల్
2020, నవంబర్ 27న భార్య, భద్రతా సిబ్బందితో కలిసి కాన్వాయ్‌లో వెళ్తుండగా టెహ్రాన్‌కు తూర్పున ఉన్న అబ్సార్డ్‌లోని విల్లాకు వెళ్తుండగా స్పీడ్ బేకర్ దగ్గర కారు స్పీడ్ తగ్గింది. రోడ్డు పక్కన ఉన్న ట్రక్కు లోపల నుంచి వచ్చిన మెషిన్ గన్ ద్వారా బుల్లెట్లు దూసుకొచ్చాయి. కేవలం ఫక్రిజాదే టార్గెట్‌గా బుల్లెట్లు దూసుకొచ్చాయి. నిమిషం వ్యవధిలో 15 బుల్లెట్లు దిగడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కానీ భార్య, భద్రతా సిబ్బందికి మాత్రం ఏం కాలేదు. అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ అధికారికంగా ఒప్పుకోకపోయినా.. ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Israel-Iran War: ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. తాజా దాడుల్లో 585 మంది మృతి
ఇక తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కూడా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు. ఈ సందర్భంగా 2020లో జరిగిన ఫక్రిజాదే హత్యను నిపుణులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు అత్యంత రహస్యంగా దాడులు చేసి చంపేస్తే.. ఇప్పుడు కూడా అణు శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసి చంపేసిందని గుర్తుచేసుకుంటున్నారు.