Sonam Raghuvanshi: వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ.. ఇంతకీ సంజయ్ ఎవరంటే..!
- వీడిన 234 ఫోన్ కాల్స్ మిస్టరీ
- సంజయ్ వర్మను గుర్తించిన మేఘాలయ పోలీసులు
- వీడుతున్న హనీమూన్ మర్డర్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనీమూన్ మర్డర్ కేసు వెనుక ఉన్న మిస్టరీని మేఘాలయ పోలీసులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. ఇక 243 ఫోన్ కాల్స్ వెనుక ఉన్న అసలు విషయం బయటపడింది. సోనమ్.. సంజయ్ వర్మ అనే వ్యక్తి మధ్య మార్చి 1 నుంచి 25 వరకు దాదాపు 119 కాల్స్ నడిచాయి. ఇందుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సంజయ్ వర్మ ఎవరనేది తెలుసుకునేందుకు సోనమ్ రఘువంశీ సోదరుడిని కలిసి పోలీసులు వాకబు చేశారు. అసలు సంజయ్ వర్మ అనే వ్యక్తే తనకు తెలియదని చెప్పాడు. దీంతో లోతుగా రికార్డులను పరిశీలించగా.. ప్రియుడు రాజ్ కుష్వాహాగా గుర్తించారు. సోనమ్.. తన మొబైల్‌లో ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుంది. దీంతో సంజయ్ వర్మ పేరుతో ఫోన్ కాల్స్ మాట్లాడినట్లుగా తేల్చారు. మొత్తానికి వివాహానికి ముందు.. తర్వాత ఇద్దరి మధ్య 200 ఫోన్ కాల్స్ నడిచాయి.
ఇది కూడా చదవండి: ENG vs IND: సెలెక్షన్ నా చేతుల్లో లేదు.. ఇప్పటికీ ఆడేందుకు సిద్ధం: సీనియర్ బ్యాటర్
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్.. తన ప్రియుడి పేరును సంజయ్ వర్మగా సేవ్ చేసుకుందని మేఘాలయ పోలీసులు తెలిపారు. 39 రోజుల్లో ఇద్దరు కలిసి 239 సార్లు కాల్స్ మాట్లాడుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ నెంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉందని పేర్కొన్నారు. ఇక నిందితులకు సోనమ్ బంధువు జితేంద్ర యూపీఐ నుంచి నగదు చెల్లించారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే సోనమ్‌తో తన కుటుంబానికి అన్ని సంబంధాలు తెగిపోయాయని గోవింద్ తెలిపాడు. ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తానని సోనమ్ సోదరుడు గోవింద్ చెప్పాడు.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడితో హోటల్‌లో ఉండగా భర్త ప్రత్యక్షం.. వివాహిత ఏం చేసిందంటే..!
ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో యూపీకి చెందిన సోనమ్‌తో మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అనంతరం మే 23న జంట అదృశ్యమైంది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జూన్ 2న రాజా మృతదేహం లభించింది. దీంతో అతడు హత్యకు గురైనట్లుగా తేల్చారు. అనంతరం భార్య సోనమ్ కోసం గాలిస్తుండగా అకస్మాత్తుగా జూన్ 8న ఘాజీపూర్‌లో ప్రత్యక్షమైంది. అనంతరం సోనమ్‌ను అదుపులోకి తీసుకోగా నేరాన్ని అంగీకరించింది. ముగ్గురు హంతక ముఠా సహా ప్రియుడు రాజ్ కుష్వాహాను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!