దేశంలో మహిళల అకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట కట్టుకున్నవాళ్లను కాటికి పంపేస్తున్నారు. కొందరు ప్రియుడితో సుఖం కోసం భాగస్వాములను చంపేస్తుంటే.. ఇంకొందరు ఆయా కారణాల చేత అంతమొందిస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం వెలుగు చూసింది.
మతోన్మాదంలో మునిగిపోయి.. ఐఎంఎఫ్ నుంచి వరుస రుణాల కోసం పరుగులు పెడుతోందని పాకిస్థాన్‌పై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ఉదయాన్ని ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈలోపే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ముగించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కారు. ప్రజలకు భద్రత కల్పించాల్సిన ఖాకీలే.. పక్కదారి పట్టి పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. సైబర్ నేరగాళ్లు కాజేసిన నగదును రికవరీ చేసి ఇదే అదునుగా భావించి ఓ పోలీస్ ప్రేమికుల జంట పరారయ్యారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
హనీమూన్ మర్డర్ కేసు తర్వాత మగాళ్లలో భయం మొదలైంది. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి సోనమ్ రఘువంశీ అనే నవవధువు చంపేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.
పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు అతలాకుతలం చేశాయి. గిల్గిట్-బాల్టిస్తాన్లోని పర్యాటక కేంద్రం దగ్గర హఠాత్తుగా వరదలు సంభవించాయి. దీంతో ఒక మహిళ సహా నలుగురు పర్యాటకులు మృతిచెందారు.
జగదీప్ ధన్ఖర్ రాజీనామా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ధన్ఖర్ సభా కార్యకలాపాలు బాగానే నిర్వహించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కనిపించలేదు.