ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్ళాయపాలెంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తైన సందర్భంగా సుపరిపాలనలో – తొలి అడుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత
తాళ్ళాయపాలెంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు వివరించినట్లు తెలిపారు. ఏడాది పాలనలో ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. సుమారుగా 50 కుటుంబాలను కలిసి పాలన గుంరిచి చెప్పడం జరిగిందన్నారు. కొందరు చిన్న చిన్న సమస్యలు చెప్పారని.. స్థానిక శాసన సభ్యులు ఆ సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రపంచం స్థాయి రాజధానిగా అమరావతి నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వం అమరావతిని అడ్డుకుని పనులు నిలిపివేసిందని ఆరోపించారు. అమరావతి అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని ప్రజలు ఎన్నికల్లో గెలిపించారని.. కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రికి తప్పిన విమానం ప్రమాదం.. పైలట్ ఏం చేశాడంటే..!