Trupm-Putin: వచ్చే వారం ట్రంప్-పుతిన్ ప్రత్యక్ష భేటీ.. జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్
- వచ్చే వారం ట్రంప్-పుతిన్ ప్రత్యక్ష భేటీ
- జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే వారం ప్రత్యక్షంగా కలవబోతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ అందుకు ససేమిరా అంటున్నారు. దీంతో ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో వివాదానికి ముగింపు పలికేందుకు పుతిన్-జెలెన్‌స్కీ ఇద్దరితోనూ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ సిద్ధపడ్డారు. వచ్చే వారం ప్రారంభంలోనే ఈ సమావేశం ఉంటుందని వైట్ హౌస్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Sakshi Malik : హీరోయిన్ పై కొరియోగ్రాఫర్ దాడి..!
Also Read
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు చర్చలు జరిపేందుకు స్వయంగా ట్రంప్ రంగంలోకి దిగుతున్నారు. పుతిన్‌తో నేరుగానే చర్చలు జరపనున్నట్లు సమాచారం. వైట్ హౌస్ అధికారి ప్రకారం.. ఈ సమావేశం వచ్చే వారం ప్రారంభంలోనే జరగవచ్చని.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు పరిష్కారం దొరకవచ్చని అభిప్రాయపడ్డారు. మాస్కో ముఖాముఖి సమావేశాన్ని ప్రతిపాదించిందని.. అందుకు అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇక పుతిన్-జెలెన్‌స్కీని కలవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahua Moitra: ఢిల్లీలో గ్రాండ్‌గా మహువా మొయిత్రా వివాహ రిసెప్షన్.. హాజరైన సోనియాగాంధీ
ఉక్రెయిన్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ట్రంప్-జెలెన్‌స్కీ ఫోన్ కాల్‌లో ప్రత్యక్ష చర్చల గురించి చర్చించారని.. ఈ ఫోన్ కాల్‌లో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూకే, జర్మనీ, ఫిన్లాండ్ నాయకులు కూడా పాల్గొన్నారని వెల్లడించారు.
ట్రంప్-పుతిన్ మధ్య సమావేశం జరిగితే.. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కలవడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక ట్రంప్-జెలెన్‌స్కీ ఇప్పటికే అనేక మార్లు కలిశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ సమావేశం అయ్యారు. ఇది వివాదాస్పదమైంది.
ఇది కూడా చదవండి: Originals vs Brave: చివరి బంతి వరకూ ఉత్కంఠ.. ఓడిన ‘సంజీవ్ గోయెంకా’ జట్టు!
తాజావార్తలు
-
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
-
Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్‌కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
-
Raaka: ‘రాకా’లో ఐదో బ్యూటీ.. అట్లీ గారు అసలు ఏం ప్లాన్ చేస్తున్నారండి!
-
Ponguleti Srinivas Reddy : 22ఏ భూములపై మంత్రి పొంగులేటి బిగ్ క్లారిటీ
-
AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!