Asim Munir: మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్.. ఈసారి ఎందుకంటే..!
- మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్
- 2 నెలల్లో రెండోసారి యూఎస్ టూర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి అగ్ర రాజ్యం అమెరికాకు వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల కాలంలో రెండో పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సుంకాల విషయంలో భారత్-అమెరికా మధ్య కొంత గ్యాప్ వచ్చింది. భారత్‌కు భారీగా సుంకాలు విధించగా.. పాకిస్థాన్‌కు మాత్రం స్వల్పంగా సుంకాలు విధించింది. దీంతో వాషింగ్టన్‌తో మరింత సంబంధాలు బలపరుచుకునేందుకు దాయాది దేశం పాక్ సిద్ధపడినట్లు సమాచారం. ఇందులో భాగంగా అసిమ్ మునీర్ మరోసారి అమెరికాకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Trupm-Putin: వచ్చే వారం ట్రంప్-పుతిన్ ప్రత్యక్ష భేటీ.. జెలెన్‌స్కీ కూడా హాజరయ్యే ఛాన్స్
Also Read
రష్యా ముడి చమురును దిగుమతి చేసుకోవడంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. తొలుత 25 శాతం పెంచగా.. జరిమానాగా మరో 25 శాతం పెంచారు. దీంతో భారత ఎగుమతులపై 50 శాతం సుంకాన్ని ప్రకటించారు. రష్యా చమురు కొనుగోలు చేసే ఏ ఇతర దేశానికైనా ఇలాంటి పరిస్థితే ఉంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ చర్యను భారత్ ఖండించింది. అన్యాయం.. అన్యాయం.. అసమంజసమైందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Sakshi Malik : హీరోయిన్ పై కొరియోగ్రాఫర్ దాడి..!
భారత్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దీన్ని క్యాష్ చేసుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అసిమ్ మునీర్ మరోసారి అమెరికా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. గత జూన్‌లో అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో గౌరవ మర్యాదలు లభించాయి. ట్రంప్ ప్రత్యేక విందు ఇచ్చారు. ఆ సమయంలోనే మరోసారి అమెరికాకు వస్తానని అప్పుడే మునీర్ చెప్పినట్లుగా పాక్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక అమెరికా పర్యటనలో ట్రంప్‌ను శాంతి బహుమతికి అసిమ్ మునీర్ మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tragic Incident: గాల్లో ఆగిపోయిన గల్ఫ్ కార్మికుని గుండె.. నేడు కోరుట్లకు మృతదేహం!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. అనంతరం పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. అనంతరం కాల్పుల విరమణకు తానే కారణం అంటూ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను భారత్ ఖండించింది. కాల్పుల విరమణకు మూడో వ్యక్తి ప్రమేయం లేదని.. ఇరు దేశాల చర్చల తర్వాతే కాల్పుల విరమణ జరిగిందని ఇటీవల పార్లమెంట్‌లో మోడీ ప్రకటించారు. మొత్తానికి అమెరికాతో ప్రస్తుతం భారత్‌కు గ్యాప్ పెరిగింది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?