Ukrainian First Lady: జైపూర్‌లో జెలెన్‌స్కీ సతీమణి ప్రత్యక్షం.. అసలేం జరిగిందంటే..!
- జైపూర్‌లో జెలెన్‌స్కీ సతీమణి ప్రత్యక్షం
- వీఐపీ లాంజ్‌లో అధికారులు మర్యాదలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు జెలెన్‌స్కీ సతీమణి ఒలెనా జెలెన్‌స్కీ జైపూర్‌లో ప్రత్యక్షమయ్యారు. జపాన్‌కు వెళ్తున్న తరుణంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండ్ అయింది.

Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
23 మంది ఉక్రెయిన్ సభ్యుల బృందం జపాన్ వెళ్తున్నారు. అయితే వారు ప్రయాణిస్తున్న విమానం.. ఆదివారం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయింది. ఈ విమానంలో ఉక్రెయిన్ ప్రథమ మహిళ, అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య ఒలెనా ఉన్నారు. ఆమెతో పాటు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు. ఇంధనం నింపుకున్న తర్వాత ఆదివారం ఉదయం 8:15 గంటలకు తిరిగి విమానం బయల్దేరి వెళ్లింది. విమానం జపాన్‌లోని టోక్యోకు వెళ్తోంది.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ కుమారుడి టీ షర్ట్ వైరల్..! అర్థమిదేనా?
విమానంలో ఇంధనం నింపుకునేందుకు ఉక్రెయిన్ విజ్ఞప్తి మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ముందస్తుగా ఆమోదం తెలిపింది. ఉక్రెయిన్ సభ్యులకు అవసరమైన ప్రోటోకాల్‌ను ఆమోదించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఆదేశించింది. దీంతో విమానం ఉదయం 6:30 గంటలకు జైపూర్‌లో ల్యాండ్ అయింది. రెండు గంటల అనంతరం తిరిగి విమానం జపాన్‌కు బయల్దేరి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: భారతీయుడెవరో నిర్ణయించేది మీరు కాదు.. న్యాయమూర్తుల తీరుపై ప్రియాంకాగాంధీ అసహనం
విశిష్ట అతిథితో పాటు ప్రతినిధి బృందం సభ్యులకు అవసరమైన మర్యాదలు కూడా చేయాలని కేంద్రం ఆదేశించింది. దీంతో బృందంలోని సభ్యులకు ఎలాంటి తనిఖీలు లేకుండానే సకల సౌకర్యాలు అందించబడ్డాయి. 23 మంది సభ్యుల బృందంలో ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి సెర్గి కిస్లిట్సా, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి ఒలెక్సీ సోబోలెవ్ కూడా ఉన్నారు. విమానంలో ఇంధనం నింపుకునేంత వరకు రెండు గంటల పాటు జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో ఉక్రెయిన్ బృందానికి సకల మర్యాదలు జరిగాయి. వీరికి స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం అధికారులు కూడా వచ్చారు.
రష్యాతో సుదీర్ఘ కాలంగా యుద్ధం జరుగుతోంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపేందుకు ఉక్రెయిన్ బృందం అంతర్జాతీయ పర్యటన చేపట్టింది. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు జపాన్ పర్యటన చేపట్టింది. అంతేకాకుండా ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో సహాయం కూడా చేయాలని జపాన్‌ను కోరనున్నారు. ఇక జపాన్, ఉక్రెయిన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. 1992 నుంచి జపాన్‌తో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. అవసరమైతే దౌత్యం కూడా చేస్తామని మోడీ ప్రకటించారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!