మహిళలను ఉద్దేశించి మహారాష్ట్ర మంత్రి జయకుమార్ గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో భర్తలు అవసరాలకు రూ.100 కూడా ఇవ్వరని.. అలాంటిది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నివిస్.. లడ్కీ బహిన్ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని తెలిపారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మసాలా బాండ్ కేసులో పినరయి విజయన్‌కు, మాజీ మంత్రి ఇస్సాక్‌కు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అన్ని పార్టీలు ఆయన్ను అభినందించాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీలకు కీలక పిలుపునిచ్చారు. ‘‘ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు’’ అని పేర్కొన్నారు.
బంగారం ధరలకు బ్రేక్‌లు పడడం లేదు. తగ్గుముఖం పడతాయేమోనని ఎదురుచూసున్న పసిడి ప్రియులకు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ధరలు దిగొస్తాయని గోల్డ్ లవర్స్ భావించారు.
వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై ఎప్పుడూ కారాలు.. మిరియాలు నూరే ట్రంప్.. ఆశ్చర్యంగా ఫోన్ సంభాషణ చేశారు. అయితే ఈ సంభాషణ కూడా కూల్.. కూల్‌గా కాకుండా.. హాట్‌హాట్‌గానే సాగినట్లు తెలుస్తోంది.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు కూడా హాట్‌హాట్‌గా సాగేటట్టు కనిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాలు కూడా వాడివేడీగా జరిగాయి.
ఆగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక అతలాకుతలం అయ్యాయి. ఇక ఇండోనేషియాపై భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాలతో సుమత్రా ద్వీపాన్ని భారీ వరదలు ముంచెత్తాయి.
టెస్లా అధినేత, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ తన భాగస్వామి గురించి కీలక విషయాలు పంచుకున్నారు. జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మస్క్ పాల్గొని పలు కీలక విషయాలు పంచుకున్నారు.
రష్యాలో వాట్సాప్ నిషేధానికి అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ మేరకు వాట్సాప్‌ను రష్యా బెదిరించింది. రష్యన్ చట్టాన్ని పాటించడంలో విఫలమైతే వాట్సాప్‌ను పూర్తిగా నిషేధం విధిస్తామని రష్యా రాష్ట్ర కమ్యూనికేషన్ వాచ్డాగ్ బెదిరించింది.