Indonesia Floods: ఇండోనేషియాలో జల విలయం.. 442 మంది మృతి
- ఆగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం
- ఇండోనేషియాలో 442 మంది మృతి
- శ్రీలంకలో 193 మంది, థాయ్‌లాండ్‌లో 145 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగ్నేయాసియాలో తుఫాన్లు బీభత్సం సృష్టించాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక అతలాకుతలం అయ్యాయి. ఇక ఇండోనేషియాపై భారీ జలఖడ్గం విరుచుకుపడింది. కుండపోత వర్షాలతో సుమత్రా ద్వీపాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో ఇప్పటి వరకు 442 మంది చనిపోగా.. వందలాది మంది తప్పిపోయారు. ఇక లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

Also Read
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
అసాధారణమైన సెన్యార్, దిత్వా తుఫానులు ఆగ్నేయాసియా అంతటా విధ్వంసం సృష్టించాయి. థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, ఇండోనేషియా దేశాలు హడలెత్తిపోయాయి. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 193 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక థాయ్‌లాండ్‌లో 145 మంది చనిపోయారు. ఇలా ఆగ్నేయాసియాలో తుఫాన్లు కారణంగా జలప్రళయం బీభత్సం సృష్టించి వందిలాది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతయ్యారు. వివప్తు బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు. శిథిలాల క్రింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు.

భారీ ఈదురుగాలులు, వర్షం కారణంగా ప్రధాన రహదారులన్నీ దెబ్బతిన్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. ప్రస్తుతం వందలాది మంది తప్పిపోయినట్లుగా కథనాలు వస్తున్నాయి. సెన్యార్ తుఫాను కారణంగా ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడటం, వరదలకు ఇళ్ళు కొట్టుకుపోయాయని, అలాగే వేలాది భవనాలు మునిగిపోయాయని అధికారులు తెలిపారు.


తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!