విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో నేను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు నాని.. వేరే ప్లేస్ లో నా స్నేహితులకు పార్టీ ఇచ్చాను.. రాత్రి 11.45 గంటల సమయంలో నాకు బోట్లు తగల బడుతున్నట్టు ఫోన్ వచ్చింది.. దీంతో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నేను హార్బర్ కు వెళ్లాను.. నేను వెళ్లే సమయానికి బోట్లు తగల బడుతున్నాయి అని తెలిపాడు.
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని..
విజయం సాధించాలంటే ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. ప్రతి ఓటరూ ముఖ్యమే. ఎందుకంటే ఒక్క ఓటుతో ఓటమిపాలైన అభ్యర్థులు కనిపిస్తారు.. వందలోపు ఓట్ల తేడాతో సీన్ రివర్సైన సందర్భాలు చాలానే ఉంటాయి. అందుకే అభ్యర్థులు ఏ ఒక్క ఓటూ చేజారకూడదని ఆశిస్తారు.. కానీ, అది అంత తేలికైన విషయం కాదు.. ఓట్ల చీలికను అడ్డుకోవటం అసాధ్యం.. ఈ విషయం అర్థమైన పార్టీలు ఇప్పుడు టెన్షన్ పడుతున్నాయి..
ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి నదిపై నిర్మించిన రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 వసంతాలను పూర్తిచేసుకుంది. నాలుగున్నర కిలోమీటర్లు పొడవైన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతిపెద్ద బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మనుగడలోకి వచ్చి నేటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈబ్రిడ్జిని 1974 లో అప్పటి రాష్ట్రపతి ఫ్రక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు
తెలంగాణలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ దృష్టిపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. దీంతో.. వారందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది ఈసీ. ప్రతి కౌంటింగ్ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది.