* అమరావతి: జనవరి నెలలో చేపట్టనున్న మూడు కీలక పథకాల అమలుపై జగన్ సర్కార్ ఫోకస్.. ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్.. పథకాల అమలు, లబ్దిదారుల భాగస్వామ్యం తదితర అంశాల పై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్
* తాడేపల్లి: నేడు వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. బస్సు యాత్ర జరిగే నియోజకవర్గాలు.. 1. రాయచోటి – అన్నమయ్య జిల్లా.. 2. పెనమలూరు -కృష్ణా జిల్లా.
* కాకినాడ: మూడు రోజులపాటు కాకినాడలోనే ఉండనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఈనెల 30 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలు, కోఆర్డినేటర్లతో సమావేశాలు
* చిత్తూరు: నేటి నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. నాలుగు మండలాలలో కార్యకర్తలతో సమావేశాలు… కుప్పం,శాంతిపురం,గుడిపల్లె బహిరంగ సభల్లో పాల్గొనున్న చంద్రబాబు
* విజయవాడ: నేడు APSPDCL డైరీ ఆవిష్కరణ చేయనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
* విజయవాడ: నేడు ధర్నా చౌక్ లో అంగన్ వాడీ లు, మున్సిపల్ వర్కర్స్ అసోసియేశన్, ఏపీ VRA అసోసియేషన్, ఎయిడెడ్ కళాశాలల పార్ట్ టైం లెక్చరర్స్ ధర్నా
* హైదరాబాద్: జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలు వాయిదా.. పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)
* ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల వద్ద 3వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…
* ఆంధ్రప్రదేశ్‌లో 17వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహ మహోత్సవం.. శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 1వ తేదీ వరకు కొనసాగునున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఐదు రోజులలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న 3.4 లక్షల మంది భక్తులు
* ప్రకాశం : వచ్చే నెల 5న కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. కనిగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు.. ప్రారంభ కార్యక్రమంలో కనిగిరిలో లక్ష మందితో భారీ బహిరంగసభ నిర్వహించేలా టీడీపీ ఏర్పాట్లు..
* ప్రకాశం : రేపు పెద్దారవీడులో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* గుంటూరు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల నిరసన కార్యక్రమం …
* గుంటూరు: నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె..
* గుంటూరు: రేపు పొన్నూరు నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటన… వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పొన్నూరు మండలం మామిళ్ళపల్లి లో హెల్త్ సెంటర్ ను సందర్శించనున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
* గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కొనసాగుతున్న నంది నాటకోత్సవ పోటీలు.. రేపు నాటకోత్సవాల ముగింపు సభ…
* గుంటూరు: ఈనెల 30న గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కాపు చైతన్య సదస్సు.. హాజరుకానున్న పలువురు కాపు సంఘాల నేతలు, రాజకీయ నాయకులు.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు..
* నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో మైనారిటీ విభాగ సదస్సు..
* విజయనగరం జిల్లా: భోగాపురం మండలంలో భోగాపురం మండలం సుందర పేట గ్రామం వద్ద గల ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం నేడు ప్రారంభించనున్న మంత్రి బూడి ముత్యాలునాయుడు. నాబోర్డు నిధుల నుంచి మూడు కోట్ల 95 లక్షల రూపాయలు వ్యయముతో నిర్మించిన భవనంను మంత్రి ప్రారంభోత్సవం చేయునున్నారు.
* అనంతపురం: శెట్టూరు మండల పరిధిలోని ములకలేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 KV విద్యుత్ ఉపకేంద్రమును ప్రారంభించనున్న మంత్రి ఉషాశ్రీచరణ్.
* అనంతపురం : రేపు అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర.
* విజయవాడ: నేడు కృష్ణా జిల్లా పెనమ లూరులో వైసీపీ సామాజిక బస్సు యాత్ర
* పశ్చిమగోదావరి జిల్లా: మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం రూరల్ మండలం నీలాద్రిపురం గ్రామంలో సర్దార్ పాపయ్య గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ , ఎంపీ మార్గాని భరత్ పాల్గొంటారు..
* విజయనగరం: నేడు జిల్లాలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు పర్యటన.. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న ఉప ముఖ్యమంత్రి, జిల్లా ఇన్ చార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు
* విజయనగరం: భోగాపురం, నెల్లిమర్ల, రామతీర్థం లో పలు కార్యక్రమాలకు హాజరు కానున్న ఇన్ చార్జి మంత్రి.. చీపురుపల్లి నియోజకవర్గంలో గుర్ల మండలంలో ఏర్పాటైన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి బొత్స
* విజయనగరం జిల్లా: దత్తిరాజేరు మండలం లో టి. భూర్జివలస, దత్తి గ్రామాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ భవనాలను నేడు ప్రారంభించనున్న ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య..
* పశ్చిమ గోదావరి: రేపు భీమవరంలో సీఎం జగన్ పర్యటన. విద్యా దీవెన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం.. సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించనున్న కలెక్టర్ ప్రశాంతి స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
* ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జనసేన-టీడీపీ ఆత్మీయ సమన్వయ సమావేశం
* తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,361 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,784 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.91 కోట్లు
* విజయవాడ: నేటి నుంచి విజయవాడలో పుస్తక ప్రదర్శన.. జనవరి 7వ తేదీ వరకు ప్రదర్శన.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అవరణలో 200 స్టాల్స్ ఏర్పాటు
* పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం మండలం మరిపల్లి నుండి నాగరగూడ, జి.శివడ నుండి కోటకొండ నూతన రహదారులను ప్రారంభించనున్న ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి.. కురుపాం మండలం లేవిడి సమీపంలో ఫిష్ ఆంధ్ర మార్ట్ ప్రారంభించనున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి.
* నేడు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల్లో ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రారంబించనున్న మంత్రి దామోదర