ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ.. ఇన్నాళ్ల ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపుగా సమాధానం ఇచ్చేసింది. మూడు రాజధానుల ఏర్పాటుపై వడివడిగా అడుగులేస్తున్న జగన్ సర్కార్.. విశాఖ నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేసింది. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల ఇన్నాళ్లూ జాప్యం జరిగినా.. డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి
బోటులో ఉప్పు చేప ఫ్రై చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేస్తుండగా.. అగ్నిప్రమాదం సంబంధించి 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి కారకులు అయ్యారు ఇద్దరు వ్యక్తులు.
ఫిషంగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు..
కార్తిక మాసంలో ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే కోటి దీపోత్సవం 12వ రోజుకు చేరింది.. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ దీపయజ్ఞం వేదికగా భక్తులతో కిటకిటలాడుతోంది.. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తు్నారు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.