టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొదట మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.
పల్నాడు జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరనున్నారు.. మాచర్ల నియోజక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి.. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నారు.. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
ఆంధ్రప్రదేశ్ మెగా క్రీడా టోర్నీకి సిద్ధమవుతోంది.. ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబరాల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఏర్పాట్లలో మునిగిపోయింది.. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది.. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహించబోతున్నారు.. గ్రామ , వార్డు సచివాలయ, మండల , నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు.. 15 ఏళ్ల వయసు పైబడిన అందరూ రిజిస్ట్రేషన్ కు అర్హులే.
తన యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది డిజిటల్ ఆన్లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ సంస్థ ఫోన్‌పే.. జనవరి 2024 నాటికి వినియోగదారుల రుణాలను ప్రారంభించాలని భావిస్తుస్తోంది. వాల్‌మార్ట్ మద్దతు ఉన్న స్టార్టప్, క్రెడిట్ అండర్‌రైటింగ్‌ను నిర్మించేటప్పుడు వ్యక్తిగత రుణాలను పంపిణీ చేస్తుంది.. ఫోన్‌పే తన ప్లాట్‌ఫామ్స్‌లో కన్సూమర్ లెండింగ్ లోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్టాగా తెలుస్తోంది.
సామాజిక విప్లవానికి నిదర్శనమే విజయవాడలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం అన్నారు మంత్రి మేరుగ నాగార్జున.. ఏపీ చరిత్రలో సామాజిక సమతుల్యత కోసం సీఎం వైఎస్ జగన్ ఈ నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.. అంబేద్కర్ చరిత్ర ఈ నిర్మాణంలో తెలుస్తుందన్నారు. త్వరలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభిస్తాం అని వెల్లడించారు.
Karthika Pournami 2023: కార్తిక పౌర్ణమిని అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన రోజుల్లో ఒకటిగా భావిస్తారు భక్తులు.. ఈ రోజున నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగిస్తుంటారు.. సూర్యోదయానికి ముందే దీపాధారదన చేస్తారు.. ముఖ్యమంత్రి శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం కార్తీక రెండవ సోమవారం, పౌర్ణమి కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో పాతాళగంగలో పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు భక్తజనం … గంగాధర మండపం, ఉత్తర శివమాడ […]