* హైదరాబాద్: నేడు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం.. నెల రోజుల పాలనపై సమీక్ష చేయనున్న సీఎం
* ఆంధ్రప్రదేశ్‌లో 28వ రోజు కొనసాగనున్న అంగన్వాడీ కార్యకర్తల నిరసన కార్యక్రమాలు..
* ఏపీలో మున్సిపల్ కార్యాలయాల వద్ద 14వ రోజు కొనసాగనున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనలు…
* నేడు ఏపీకి సీఈసీ రాజీవ్‌కుమార్ రాక.. రేపు ఉదయం రాజకీయ పార్టీల నేతలతో భేటీ.. అనంతరం ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, ఏర్పాట్లపై సమీక్ష
* ప్రకాశం : టంగుటూరు, కొండేపి ఎంపీడీవో కార్యాలయాల్లో వైఎస్సార్ పించన్ కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిములపు సురేష్..
* ఒంగోలులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* ప్రకాశం : ఇవాళ తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యే అవకాశం.. జిల్లాలో పలు స్థానాల్లో ఇంచార్జ్ ల మార్పులు, చేర్పులతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట వ్యవహారంపై చర్చించే అవకాశం..
* తిరుమల: 16వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలో గోదాదేవి పరిణయోత్సవం.. మధ్యాహ్నం 1 గంటకు పార్వటే ఉత్సవం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు సిటీ పరిధిలోని సంతపేట ప్రాంతంలో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న మాజీ మంత్రి నారాయణ
* నెల్లూరు: ఇందుకూరుపేటలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి
* విజయవాడ: తండ్రి బాటలో కుమార్తె.. టీడీపీకి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయనున్న కేశినేని శ్వేత. కార్పోరేటర్ పదవి వచ్చేలా సహకరిచినందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలపనున్న శ్వేత. ఆ తర్వాత మున్సిపల్ కార్పోరేషనుకెళ్లి పదవికి రాజీనామా చేయనున్న శ్వేత. కార్పోరేటర్ పదవికి రాజీనామా అనంతరం పార్టీకీ రాజీనామా చేయనున్న శ్వేత. తన కుమార్తె రాజీనామా చేయనున్నట్టు ట్వీట్ చేసిన కేశినేని నాని.
* గుంటూరు: నేడు తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాదయాత్ర.. సంఘం జాగర్లమూడి నుండి పాదయాత్ర ప్రారంభించనున్న మాజీ మంత్రి రాజా ..
* గుంటూరు: నేడు స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాల్లో బాధితుల నుండి అర్జీలు స్వీకరించనున్న జిల్లా ఉన్నతాధికారులు.
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో నేటి నుంచి మూడు రోజులు పాటు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన. రూరల్ మండలానికి చెందిన పార్టీ శ్రేణులతో పంచాయతీల వారిగా సమీక్ష సమావేశం నిర్వహించనున్న బాలయ్య
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో నేటి నుంచి నియోజకవర్గంలో నాలుగు రోజులు పాటు రీజనల్ కో ఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.. పంచాయితీల వారీగా నాయకులు , కార్యకర్తలతో సమావేశం.
* అనంతపురం : పాత పింఛన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో గుత్తిలో నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు.
* శ్రీ సత్యసాయి : పెనుకొండలో స్థానిక ఎమ్మెల్యే శంకరనారాయణ ఇంటిలో మంత్రి ఉషశ్రీ తో కార్యకర్తల సమావేశం.
* అనంతపురం : కంబదూరు, కుందుర్పి, మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో పింఛను పెంపు మహోత్సవాలు కార్యక్రమం పాల్గొననున్న వైస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య
* పశ్చిమ గోదావరి: తణుకు నియోజకవర్గంలో ప్రజా దీవెన పాద యాత్ర కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి కారుమూరి నాగేశ్వర రావు
* పశ్చిమ గోదావరి: తాడేపల్లి గూడెం లో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు సోమవారం యథాతథంగా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి స్పందన.. నియోజక వర్గ, మండల స్థాయి అధికారులు కలెక్టరేట్ లోని స్పందనకు హాజరు కావాలి-కలెక్టర్ డా కే.మాధవీలత
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో రైతు ప్రదర్శన.. మున్సిపల్ స్టేడియం నుండి రివర్ బే ఆహ్వానము ఫంక్షన్ హాల్ లో రైతు రాష్ట్ర మహాసభ లు. ముఖ్యఅధితులు హాజరుకానున్న మాజీ మంత్రి వడ్డే శోభనదేశ్వరావుగారు, రావుల వెంకయ్య , రైతు పరిశోధకులు
* తూర్పుగోదావరి జిల్లా: జూనియర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన. రాజమండ్రి ప్రాంతీయ ఇంటర్ బోర్డు. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సెలవులు. తిరిగి 17వ తేదీన కళాశాలలు ప్రారంభం.. సెలవుల సమయంలో ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఇంటర్ బోర్డు
* తిరుమల: 14వ తేదీతో ముగియనున్న ధనుర్మాసం.. 15వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పున:రుద్దరణ
* నేడు విజయనగరం జిల్లా మెంటాడ మండలంలోని మెంటాడలో సచివాలయం ప్రారంబోత్సవం.. పింఛన్లు పంపిణీ కార్యక్రమం.. చల్లపేటలో నూతన పిహెచ్సి భవనం ప్రారంబోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
* పార్వతీపురం మన్యం జిల్లా: ఉత్తరాంధ్ర ఇలవేల్పు సంబర పోలమాంబ అమ్మవారిని నేడు ఊరి వెలుపల ఉన్న అమ్మవారిని గోముఖీ నదీ తీరంలోని గద్దె వద్దకు తీసుకొని వచ్చి ప్రత్యేక పూజలు. మేళ తాళాలు సాంస్కృత కార్యక్రమాలతో చదురు గుడిలోకి తల్లిని ఆహ్వానించనున్న పూజారి, జన్ని, గిరడ, కర్ణం కుటుంబీకులు
* విజయవాడ: తండ్రి బాటలో కుమార్తె.. టీడీపీకి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయనున్న కేశినేని శ్వేత. కార్పోరేటర్ పదవి వచ్చేలా సహకరిచినందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇంటికెళ్లి కృతజ్ఞతలు తెలపనున్న శ్వేత. ఆ తర్వాత మున్సిపల్ కార్పోరేషనుకెళ్లి పదవికి రాజీనామా చేయనున్న శ్వేత. కార్పోరేటర్ పదవికి రాజీనామా అనంతరం పార్టీకీ రాజీనామా చేయనున్న శ్వేత. తన కుమార్తె రాజీనామా చేయనున్నట్టు ట్వీట్ చేసిన కేశినేని నాని.
* కర్నూలు: రేపు పత్తికొండ నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన.. కడమకుంట్ల, మిట్టతాండ, ఎర్రగుడిలో మృతి చెందిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి..