Road Accident: పండుగ పూట జరిగిన ఓ ప్రమాదం.. కుటుంబంతో పాటు ఊరిలో విషాదాన్ని నింపింది.. సంక్రాంతి పండుగ సందర్భంగా సోదరికి వస్త్రాలు బహుమతిగా అందించేందుకు వెళ్తూ మార్గమధ్యం యర్నగూడెం హైవే వద్ద డివైడర్ ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు.. పండుగ పూట కన్న కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.. ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన సమయంలో.. చేతికి అందివచ్చిన కొడుకును కోల్పోయి.. గుండెలు పగిలేలా విలపిస్తున్నారు.
Read Also: MS Dhoni: రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని ఎంఎస్ ధోనికి ఆహ్వానం
ఇక, ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన విష్ణు 20 ఇటీవలే బీటెక్ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన తోబుట్టువు వద్దకు కోరుకొండ నుండి నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరాడు.. అయితే, యర్నగూడెం జాతీయరహదారిపై ప్రమాదం జరిగింది.. ఫ్లై ఓవర్ వద్ద మార్జిన్ ను ఢీకొని తలకు తీవ్రగాయాలయ్యాయి.. పండుగ సందర్భంగా తన సోదరికోసం విష్ణు తీసుకెళ్తున్న చీర, బట్టల సంచి రక్తపు మడుగులో తడిసిపోయింది.. సోదరికోసం ఆనందంగా బట్టలు తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.. ఆ పరిస్థితులు హృదయాన్ని కలచివేస్తున్నాయి.. అయితే, తీవ్ర గాయాలపాలైన విష్ణుకు చికిత్సకోసం వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే విష్ణు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలోలో రికార్డు అయ్యాయి..