నంద్యాల జిల్లా అవుకులో దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.. చల్లా కుటుంబంలో ఎప్పటి నుంచో ఈ విభేదాలు కొనసాగుతూ రాగా.. ఈ సారి, ఘర్షణ, పరస్పరం దాడి వరకు వెళ్లింది వ్యవహారం.. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి చల్లా శ్రీలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ జరిగినట్టుగా చెబుతున్నారు.
రెండో రోజు తన సొంత జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకోనున్న ఆయన.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.
ఏపీ ప్రజల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్కు మా వంతు తోడ్పాటు అందిస్తాం.. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తున్నాం.. 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ గెలుపుకోసమే మేం పనిచేస్తాం'' అని తన ట్వీట్లో పేర్కొంది ఐప్యాక్
చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్, లోకేష్.. ఆ ముగ్గురి మధ్య మూడు గంటల పాటు సాగిన చర్చలు ఇప్పుడు కీలకంగా మారాయి.. ఏపీలో రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ ఎత్తుగడులు వేస్తారు. పీకే.. టీడీపీతో కలిసి పనిచేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.