నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశాం.. 2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సంక్రాంతి పందాల కోసం పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తున్నారు వ్యాపారులు.. కోడి పుంజుల పెంపకం ద్వారా వందలాది మందికి ఉపాధి కూడా లభిస్తుందని చెబుతన్నారు. కోడి పుంజులు అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది అంటే మామూలు విషయం ఏమీ కాదు.
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పంచాహ్నిక దీక్షలతో 7 రోజులు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.