నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పశ్చిమ ప్రాంతవాసుల వరప్రధాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు టన్నెల్స్ ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు..
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీ నుండి గెంటేస్తారని అన్నారు కొడాలి నాని. పుట్టినరోజుకి, చావుకు తేడా తెలియని లోకేష్‌ను సీఎం చేయడం కోసం.. జూనియర్ ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి, అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..