Pithani Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న తరుణంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన పార్టీకి రాజీనామా చేశారు.. ఇక, అధికార వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ అయ్యారు.. రేపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.. కాగా, 2014 నుంచి 2019 వరకు ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు పితాని బాలకృష్ణ.. అయితే, 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన బాలకృష్ణ.. ఆ వెంటనే జనసేన పార్టీలో చేరారు.. ఇక, గత ఎన్నికల్లో జనసేన తరపున ముమ్మిడివరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగినా విజయం సాధించలేకపోయారు.. అయితే, ఇప్పుడు జనసేన సీటు నిరాకరించడంతో.. తిరిగి సొంత గూటికి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు పితాని బాలకృష్ణ..
Read Also: Tillu Square Collections: టిల్లు స్వేర్ కు అదిరిపోయే కలెక్షన్స్.. ఇక హిట్ కొట్టాలంటే..?
కాగా, ఇప్పటికే జనసేనపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు పితాని బాలకృష్ణ. శెట్టిబలిజలకు ఒకరికి కూడా సీటు ఇవ్వలేదని పార్టీని ప్రశ్నించారు. వన్ కళ్యాణ్ కనీసం కలవడానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపణలు గుప్పించారు. ముమ్మిడివరం పొత్తులో టీడీపీకి వెళ్తే రామచంద్రపురం సీటుపై ఆశలు పెట్టుకున్నారు పితాని బాలకృష్ణ. అక్కడ తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా ఈ రోజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు పితాని బాలకృష్ణ.