* ఐపీఎల్ 2024: నేడు లక్నోతో పంజాబ్ ఢీ.. రాత్రి 7.30 గంటలకు లక్నో వేదికగా మ్యాచ్
* కర్నూలు: నేడు జగన్ 4వ రోజు బస్సుయాత్ర.. తుగ్గలి ,జొన్నగిరి మీదుగా జగన్ బస్సు యాత్ర .. తుగ్గలి లో సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి.. అనంతపురం జిల్లా గుత్తిలోకి ప్రవేశించనున్న జగన్ బస్సు యాత్ర…
* నేడు కర్నూలు నుంచి అనంతపురం జిల్లాలో ప్రవేశించనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర. జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశం. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర. సంజీవపురం శివారులో రాత్రి.
* తిరుపతి జిల్లా: నేడు నాయుడుపేటకు టీడీపీ అధినేత చంద్రబాబు.. బస్ స్టాండ్ సెంటర్ లో జరిగే ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు
* కడప : నేడు కడప జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన… ఉదయం 11 గంటలకు ప్రొద్దుటూరులో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు
* తిరుపతి : నేడు శ్రీకాళహస్తికి టీడీపీ అధినేత చంద్రబాబు.. బేరివీధి వద్ద సర్కిల్ వద్ద జరిగే ప్రజా గళం బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. రాత్రి కాళహస్తిలో బస…
* అన్నమయ్య: నేడు రాజంపేట పార్లమెంటులో మాజీ సీఎం నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి పర్యటన , మదనపల్లెలో రోడ్ షో.. సాయంత్రం పీలేరులో ప్రెస్ మీట్..
* కాకినాడ: నేటి నుంచి నాలుగు రోజుల పాటు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి గొల్లప్రోలుకి హెలికాప్టర్ లో వెళ్లనున్న పవన్.. తొలిరోజు శక్తిపీఠం పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని వారాహికి ప్రత్యేక పూజలు, అనంతరం దత్త పీఠం దర్శనం, దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లనున్న పవన్.. సాయంత్రం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వారాహి విజయ యాత్ర పేరుతో బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్
* ప్రకాశం : ఒంగోలులో ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: మార్కాపురంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి,
* ప్రకాశం: మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి..
* బాపట్ల : చీరాలలో భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణానికి శ్రీ రఘురామ భక్త సేవ సమితి ఆధ్వర్యంలో గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని పసుపు దంచి ప్రారంభించనున్న భక్తులు..
* నెల్లూరు : కందుకూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వై. విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు
* నెల్లూరులో ఐ.టీ. వింగ్ సభ్యులతో జరిగే ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయ సాయి రెడ్డి
* నెల్లూరు: కలిగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో విజయ సంకల్ప యాత్రను నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి
* నెల్లూరు: చేజర్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* శ్రీ సత్యసాయి : కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఇవాళ బ్రహ్మరథోత్సవం.
* అనంతపురం : తాడిపత్రి రూరల్ పరిధిలోని గన్నేవారిపల్లి కాలనిలో పర్యటించనున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.
* అనంతపురం : కళ్యాణదుర్గం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం. ఈ సమావేశానికి హాజరు కానున్న అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు , ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు.
* ఏలూరు: నేడు న్యాయం కోసం అంటూ. రెండో రోజు ప్రజల ముందుకు వెళ్ళనున్న టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నేడు బిక్కవోలు మండలంలో కుటుంబ సభ్యులతో కలిసి రామకృష్ణారెడ్డి పర్యటన.. కనీసం మాటైనా చెప్పకుండా టిక్కెట్ ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుని బిజెపికి ఇవ్వడంపై మండిపాటు
* విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం పై నేడు ఓటర్లలో అవగాహన కార్యక్రమం.. కోట వద్ద నుంచి రాజీవ్ స్టేడియం వరకు 2K RUN నిర్వహించనున్న అధికారులు.. జాయింట్ కలెక్టర్ శ్రీ కె కార్తీక్, ట్రైనీ కలెక్టర్ బి. సహాదిత్ వెంకట్ త్రివినాగ్, యువత, క్రీడాకారులు పాల్గొంటారు.
* విశాఖ: నేడు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ -IIM(V) 8వ స్నాతకోత్సవం… ముఖ్య అతిథిగా యాక్సిస్ బ్యాంక్ CEO &MD అమితాబ్ చౌదరి
* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60,958 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,245 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.41 కోట్లు
* నేడు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన.. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్