IAS Officers Simple Marriage: పెళ్లంటే హంగు, ఆర్భాటాలు.. ఎవరిస్థాయిలో వారు నిర్వహిస్తారు.. మరి కొందరు అయితే.. మాట రావొద్దు అంటూ.. అప్పు చేసైనా గొప్పలకు పోయి పెళ్లిళ్లు చేసేవారు ఉన్నారు.. జీవితంలో ఒక్కసారే చేసుకునే ఈ తంతు.. కలకాలం గుర్తుండిపోవాలి అంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేసేవారు లేకపోలేదు.. అయితే, పెళ్లంటే ఆర్భాటాలు కాదు.. ఒకరికి ఒకరు జీవితాంతం తోడు నీడగా నిలబడటమేనని నిరూపించింది ఓ యువ ఐఏఎస్ జంట.. ధూమ్ ధామ్ గా పెళ్లి […]
ATM Cash Van Robbery Case: ఈ నెల 19న బెంగళూరు..సిలికాన్ సిటీలో పట్టపగలే కోట్ల రూపాయల నగదును సినీ ఫక్కీలో దోచుకోవడం కలకలం రేపింది. ఏటీఎంలలో నగదు నింపడానికి వెళ్తున్న ఏజెన్సీ వాహనాన్ని కేంద్ర ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో అనుసరించింది దోపిడీ దొంగల ముఠా. కొంతదూరం వెళ్లిన తర్వాత క్యాష్ వెహికల్‌ను అడ్డగించి.. తాము సీబీఐ అధికారులమని చెప్పారు. వాహనాన్ని తనిఖీ చేయాలంటూ…. వ్యాన్‌లోని గన్‌మెన్, ఇతర సిబ్బందిని కిందకు దింపేశారు. తనిఖీ నిమిత్తం […]
Story Board: మావోయిస్టులకు కొంతకాలంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజల కోసం మొదలైన ఉద్యమం.. చివరకు మావోయిస్టులు వర్సెస్ పోలీసులుగా మారింది. ఈ పోరు ఐదు దశాబ్దాల పాటు రాజీలేని విధంగా సాగింది. గతంలో ఓసారి పోలీసులది పైచేయి అయితే.. మరోసారి మావోయిస్టులది పైచేయి ఉండేది. ప్రతీకార దాడులు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పోరాటం ఏకపక్షమైపోయింది. ఎక్కడ చూసినా మావోయిస్టుల ఎన్కౌంటర్లే తప్ప.. పోలీసుల మరణాలు కనిపించడం లేదు. ఇంతింతై వటుడింతై […]
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె. […]
Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు సాగుతోంది.. ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా కసరత్తు సాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖలకు పలు కీలక సూచనలతో లేఖలు పంపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సర్వీస్ పొడిగింపుతో విజయానంద్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. ఇక, మూడు నెలల తర్వాత ప్రస్తుత స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్‌కు సీఎస్ బాధ్యతలు […]
YS Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె. శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు […]
* దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రధాని మోడీ.. జోహన్నెస్‌బర్గ్‌లో ఇవాళ జీ20 శిఖరాగ్ర సదస్సు.. హజరుకానున్న ప్రధాని మోడీ *ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్.. గౌహతి వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం * శ్రీ సత్యసాయి : సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఉదయం 11 గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. […]
NTV Daily Astrology as on 22nd November 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
AP Chief Secretary: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా కొత్త సీఎస్‌ను నియమించాలా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం చూస్తే ప్రస్తుత ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ మరియు సీఎం ఆఫీస్‌కు ప్రత్యేక సీఎస్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. […]