Minister Atchannaidu: గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మిర్చి సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో గుంటూరులో మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో ఎగుమతిదారులు, దిగుమతిదారులు, రైతులతో సమీక్ష నిర్వహించారు. యార్డులో రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా సదుపాయాలు, ఎగుమతి, దిగుమతి దారులతో ధరల పతనం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. గత ఏడాది మిర్చి రైతులు అనేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. గత సీజన్ లో ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులు భారీగా మిర్చి సాగుచేశారన్నారు. మొదట్లో రేటు బాగానే ఉన్నా తర్వాత ధరలు తగ్గాయన్నారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే ధరలుంటాయో ఆ స్థాయిలో సాగు చేసేలా అవగాహన కల్పించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. గత ఏడాదిలక్షా 90 వేల హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది లక్షా 6 వేల హెక్టార్లలో రైతులు మిర్చి సాగు చేశారన్నారు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేసిన మిర్చికి రుణాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి మిర్చి మార్కెట్ యార్డుకు వస్తుందని, మిర్చి సాగు చేసిన రైతుల వివరాలు రికార్డు చేస్తున్నామన్నారు. నల్లి తామర వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు..
Read Also: ‘Mana Shankara Vara Prasad Garu’: డాన్స్ ఫ్లోర్ షేక్ చేయబోతున్న మన శంకర వర ప్రసాద్ హుక్ స్టెప్..!