ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులకు కష్టాలు తప్పడం లేదు.. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఈ రోజు, రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఇక, ఆన్లైన్ లేనివారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు..
వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్
గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తెలుగుదేశం పార్టీ.. జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో వేరే ఎవరికి కేటాయించ వద్దని కోరుతూ.. అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ.. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న కారణంగా.. గాజు గ్లాసు గుర్తును జనసేనకే రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.. దీనిపై నేడు విచారణ చేపట్టనుంది ఏపీ హైకోర్టు.