Minister Kandula Durgesh: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తెగువ, పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ .. స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి.. సదా ప్రాతః స్మరణీయుడు అని పేర్కొన్న ఆయన.. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా రాజమండ్రి గోదావరి బండ్ పై ఉన్న ఆయన విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు మంత్రి దుర్గేష్.. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బల రామకృష్ణ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.
Read Also: Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాట ఘటన.. ప్రధాన నిందితుడి సమాచారం ఇస్తే రూ.లక్ష రివార్డు
ఇక, ఈ సంధర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరైన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట స్థాయి వేడుకలుగా జరిపించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం లేని సమయంలో దేశా స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో పోరాట యోధులలో అగ్రగణ్యుడు అల్లూరి అన్నారు. ఈ నేల నాది, ఈ భూమి నాది అని పోరాడి.. స్వాతంత్ర పోరాట స్ఫూర్తి తీసుకుని వచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి అన్నారు. అతివాదం ఉండాలని సాయుధ పోరాట చైతన్యం తీసుకుని, ప్రాతః స్మరణీయుడు అల్లూరి అన్నారు. అదే స్ఫూర్తి ని ముందుకు తీసుకుని వెళ్లే గొప్ప సంకల్పంతో , రాష్ట్ర అభివృద్ది కోసం మనందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి తెగువ పోరాట పటిమ నుంచి యువత స్ఫూర్తి పొందాలని పిలుపు నిచ్చారు. అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా పేర్కొన్నారు మంత్రి కందుల దుర్గేష్.