Gummadi Sandhya Rani: గిరిజనులకు విద్యా, ఉపాధి కల్పిస్తాం.. గంజాయి జోలికి పోవద్దు.. గంజాయి పండిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.. హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో ఈ రోజు గంజాయి నివారణపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. బోర్డర్లల్లో చెక్ పోస్టులను పటిష్టం చేయాలని అధికారులకు మంత్రివర్గ ఉప సంఘం సూచించింది.. గంజాయి సాగుని అరికట్టేలా చర్యలు చేపట్టాలన్నారు మంత్రులు.. గంజాయి సాగు చేసే పేదలు, గిరిజనులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయన్ని మంత్రి వర్గ ఉప సంఘం వెల్లడించింది..
Read Also: Radhakishan Rao: టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు అరెస్ట్..
ఇక, ఈ సందర్భంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. గంజాయి నియంత్రణ మీద ఫోకస్ పెట్టాం.. గంజాయి నిర్మూలన అనేది దీర్ఘకాల లక్ష్యంగా ఉంటుంది.. గతంలో చంద్రబాబు ఇచ్చిన భూముల్లో గిరిజనులు పెట పండించి ఉపాధి పొందేవారు. గత ఐదేళ్లుగా వ్యవసాయం చేసే గిరిజనులకు గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. గతంలో మాదిరిగా గిరిజనులు వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో గంజాయిని పండించొద్దు అని స్పష్టం చేశారు సంధ్యారాణి.. ప్రభుత్వ భూముల్లో గంజాయి పండిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక, వ్యవసాయం చేసే గిరిజనులకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తాం. విద్యా, ఉపాధిని గిరిజనులకు కల్పిస్తాం అని పేర్కొన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.