CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నీతి ఆయోగ్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.. విజన్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనపై నీతి ఆయోగ్ ప్రతినిధులతో చర్చించనున్నారు.. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ డాక్యుమెంట్లపై సీఎం సమీక్ష కొనసాగనుంది.. ఇప్పటికే డాక్యుమెంట్ రూపకల్పనపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించింది ప్రణాళిక శాఖ. అయితే, ప్రధాని నరేంద్ర మోడీతో వికసిత్ ఏపీ విజన్ – 2047 డాక్యుమెంట్ విడుదల చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.. మరోవైపు.. దేవదాయ శాఖపై కూడా ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
Read Also: KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్.. లక్నోతోనే కేఎల్ రాహుల్!
కాగా, పేదరిక నిర్మూలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘విజన్ డాక్యుమెంట్ 2047’ను అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సులో సీఎం ప్రసంగిస్తూ.. ఈ విజన్ డాక్యుమెంట్ ప్రధాని నరేంద్ర మోడీ.. విజన్ విక్షిత్ భారత్ 2047తో కలిసి ఉంటుందని వివరించారు. ఇక, జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలు మరియు మండలాలకు సంబంధించిన 2047 విజన్ డాక్యుమెంట్లను కూడా తీసుకురావాలని ఆదేశించారు. 90వ దశకంలో తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రారంభించిన విజన్ 2020 కోసం తాను చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, హైదరాబాద్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధికి నాంది పలికిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయం విదితమే.