Minister Nara Lokesh in US: ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలం.. ఏవియేషన్‌లో పెట్టుబడులు పెట్టండి
- అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్ బిజీబిజీ..
- డల్లాస్ లో పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ తోభేటీ..
- మీ ప్రాజెక్టులకు ఏపీ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh in US: అమెరికాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. వివిధ సంస్థలు.. పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు అవుతూ.. పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు.. ఇక, డల్లాస్ లోని పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్‌మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తోభేటీ అయ్యారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ అండ్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్‌టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీలోని తీరప్రాంతంలో అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లు, పెద్ద పట్టణాల అభివృద్ధిలో సహకారం అందించండి. విశాఖపట్నంలో ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుచేయాలని భావిస్తున్నాం. ఏరోస్పేస్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలు నెరేవేర్చడం, ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో మీ అనుభవం, సహకారం మాకు ఎంతగానో ఉపయోగపడతాయి. మా ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ను ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం వహించే అంశాన్ని పరిశీలించండి అని కోరారు..
Read Also: Mirzapur : సినిమాగా వస్తున్న మీర్జాపూర్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఇక, విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఎకో సిస్టం ఉంది. ఈ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రదేశం. నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్, ఏరోస్పేస్‌లో గ్లోబల్ ప్లేయర్‌లను ఆకర్షించడానికి మీ వంటి అనుభవజ్ఞుల నైపుణ్యం మాకు ఉపయోగపడుతుందన్నారు మంత్రి లోకేష్. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో పోర్టులు, హైవేలు, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పీపీపీ ప్రాతిపదికన భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ పెరోట్ జూనియర్ ను కోరారు. మంత్రి లోకేష్ వెంట బృందం సభ్యులు కార్తికేయ మిశ్రా, సాయికాంత్ వర్మ ఉన్నారు. కాగా, పెరోట్ జూనియర్ రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, డాటా సెంటర్, ఎనర్జీ రంగాల్లో విభిన్న పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో ఆయన అగ్రగామిగా ఉన్నారు. అలయన్స్ టెక్సాస్‌తో సహా యునైటెడ్ స్టేట్స్‌లోని కొన్ని విజయవంతమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెరోట్ కీలక భూమిక వహించారు. 27,000 ఎకరాల మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ అలయన్స్ టెక్సాస్‌ను అభివృద్ధి చేయడంలో రాస్ పెరోట్ జూనియర్ విశేషమైన గుర్తింపు పొందారు. రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ ఏవియేషన్ రంగాల్లో పెరోట్ రూపొందించిన వెంచర్లు అమెరికాలో బిలియన్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి. తన ప్రాజెక్ట్‌లలో అధునాతన సాంకేతికతలు, అంతరిక్ష ఆవిష్కరణలతో పెరోట్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!